ETV Bharat / business

మరో నెల రోజులు జైల్లోనే నీరవ్​ మోదీ - లండన్​ కోర్టు

లండన్​ కోర్టులో నీరవ్​ మోదీకి మరో సారి చుక్కెదురైంది. పీఎన్​బీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్​ను నేడు విచారించిన లండన్ కోర్టు.. వచ్చే నెల 17 వరకు కస్టడీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

నీరవ్ మోదీ
author img

By

Published : Sep 19, 2019, 5:31 PM IST

Updated : Oct 1, 2019, 5:36 AM IST

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు.. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అక్టోబర్​ 17 వరకు కస్టడీని పొడిగించింది లండన్​లోని వెస్ట్ మినిస్టర్ కోర్డు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా.. లండన్​ జైలు నుంచి నీరవ్​ మోదీ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ అనంతరం నీరవ్ కస్టడీ పెంచుతూ ఉత్తర్వులిచ్చింది కోర్టు. నీరవ్ మోదీ విచారణ వచ్చే ఏడాది మే 11 నుంచి 15 వరకు ఉండొచ్చని తెలిసింది.

ఈ ఏడాది మార్చి19న నీరవ్‌ మోదీని అరెస్టు చేసిన స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైల్లో ఉంచారు. ఇది లండన్​లో అత్యంత రద్దీగా ఉండే కారాగారాల్లో ఒకటి. అంతకు ముందు నుంచే భారత దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలు నీరవ్​ను భారత్​కు రప్పించేందుకు చాలా ప్రయత్నించాయి. సమన్లు జారీ చేసినప్పటికీ నీరవ్ వాటికి స్పందించలేదు.

ఇదీ చూడండి: ఉద్దీపన పథకాలు ఇప్పుడే వద్దు: దువ్వూరి సుబ్పారావు

Noida (UP), Sep 19 (ANI): Transport associations in Noida have called for a strike to protest against the steep hike in penalties for road traffic violations under the newly amended Motor Vehicles Act. Transport associations in Delhi will also go on a strike.
Last Updated : Oct 1, 2019, 5:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.