సరికొత్త సాంకేతిక హంగులతో స్మార్ట్ఫోన్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది షియోమి. అత్యాధునిక సాంకేతికత, సదుపాయాలతో సీసీ సిరీస్ నుంచి మొదటిసారి చరవాణులను తీసుకురానున్నట్లు ప్రకటించింది చైనా దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ.
సీసీ9, సీసీ9ఈ లను జులై 2న చైనాలో ఆవిష్కరించనున్నట్లు పేర్కొంది.
షియోమీకే చెందిన రెడ్మీ కే20, కే20 ప్రోలను భారత విపణిలోకి తీసుకొస్తున్నందున.. కొత్త సీసీ సిరీస్ ఫోన్లను చైనాకే పరిమితం చేయాలని సంస్థ భావిస్తోంది. కొద్ది రోజుల విరామం తర్వాత భారత మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది.
ఇదీ చూడండి:
సరికొత్త హంగులతో షియోమీ కొత్త ఫోన్లు
ఎంఐ సీసీ9, సీసీ9ఈ ల ప్రత్యేకతలు ఇప్పటికే నెట్టింట లీక్ అయ్యాయి. ఎంఐ సీసీ9 మోడల్.. ఆండ్రాయిడ్ 'పై' ఆధారిత ఎంఐయూఐ 10 సాఫ్ట్‌వేర్‌తో నడుస్తుంది.
ఎంఐ సీసీ9 ప్రత్యేకతలు...
- అమోలెడ్(6.39 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్) తెర
- స్నాప్‌డ్రాగన్ 730 చిప్సెట్ ప్రాసెసర్
- బ్యాటరీ సామర్థ్యం- 4,000 ఎంఏహెచ్
- 48+16+12 మెగాపిక్సెళ్లతో 3 వెనక కెమెరాలు, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
ఎంఐ సీసీ9ఈ ప్రత్యేకతలు..
- అమోలెడ్(5.97 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ తెర)
- స్నాప్‌డ్రాగన్ 710 చిప్సెట్ ప్రాసెసర్
- బ్యాటరీ సామర్థ్యం- 3,500 ఎంఏహెచ్
- 48+8+5 మెగాపిక్సెళ్లతో 3 వెనక కెమెరాలు, 32 ఎంపీ ముందు కెమెరా