ప్రీమియం వీడియో స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారత యూజర్లకు రూ.199కే నెలవారీ చందాతో సరికొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. అమెజాన్ సహా ఇతర స్థానిక సంస్థల నుంచి వస్తున్న పోటీని ఎదుర్కొనేందుకు నెట్‌ఫ్లిక్స్ ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. గత కొన్ని నెలలుగా భారత్‌లో మొబైల్ ఓన్లీ ప్లాన్‌పై ట్రయల్ నిర్వహిస్తోంది నెట్‌ఫ్లిక్స్. ఈ ఆఫర్లో సభ్యత్వం తీసుకున్న వినియోగదారులు కేవలం ఒక సారి ఒక మొబైల్లో మాత్రమే కంటెంట్‌ను వీక్షించొచ్చు. తక్షణమే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాట్లు నెట్ ఫ్లిక్స్ పేర్కొంది.
ప్రస్తుతం అమెజాన్, హాట్ స్టార్, జీ5 రూ.999ల వార్షిక చందాతో ప్రీమియం కంటెంట్‌ను అందిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ తాజా ఆఫర్‌తో ఆయా సంస్థలకు గట్టి పోటీ ఎదురుకానుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న మూడు ప్లాన్లను కూడా సవరించింది నెట్ ఫ్లిక్స్.
స్మార్ట్ ఫోన్ వినియోగంలో యూజర్లు 30 శాతం సమయాన్ని ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం వెచ్చిస్తున్నారు. ముఖ్యంగా జియో వచ్చిన తర్వాత ఈ వినియోగం మరింత పెరిగింది. స్మార్ట్ ఫోన్లో అధికంగా నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ను వినియోగిస్తున్న దేశం భారత్. ఈ సానుకూలతలన్నింటిని అందిపుచ్చుకునేందుకుని వినియోగదారులను పెంచుకోవాలని భావిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఇండియా డైరెక్టర్ అజయ్ అరోరా తెలిపారు.
ఇదీ చూడండి:జీఐఐ ర్యాంకింగ్‌లో భారత్‌కు 52వ స్థానం