ETV Bharat / business

ఆసియా కుబేరుల్లో మళ్లీ అగ్రస్థానానికి ముకేశ్ అంబానీ - అంబానీ వార్తలు

ఆసియాలో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానాన్ని ముకేశ్​ అంబానీ తిరిగి సొంతం చేసుకున్నారు. 80 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన ఈ స్థానాన్ని పొందారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజా డేటాలో ఈ విషయం వెల్లడైంది.

Mukesh Ambani Overtakes Chinese Billionaire Zhong Shanshan
ఆసియా కుబేరుల్లో మళ్లీ అగ్రస్థానానికి ముకేశ్ అంబానీ
author img

By

Published : Feb 27, 2021, 5:36 AM IST

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ.. ఆసియా కుబేరుల్లో అగ్రస్థానాన్ని మళ్లీ సొంతం చేసుకున్నారు. ఆయన సంపద విలువ 8 వేల కోట్ల డాలర్లని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ వెల్లడించింది. ఆసియా అగ్రగామి కుబేరుల జాబితాలో గత రెండేళ్లలో ఎక్కువకాలం ముకేశే ఉన్నారు.

అంతకుముందు అగ్రస్థానంలో కొనసాగిన అలీబాబా గ్రూప్ హోల్డింగ్ అధిపతి జాక్ ‌మా నుంచి మొదటి స్థానాన్ని ముకేశ్ దక్కించుకున్నారు. డిసెంబర్‌లో చైనాకు చెందిన నాంగ్‌పూ స్ప్రింగ్ కంపెనీ అధిపతి జోంగ్‌ షాన్‌ ఆసియా అపరకుబేరుడిగా అవతరించారు. ఆయన సారథ్యంలోని వ్యాక్సిన్‌ తయారీసంస్థ బీజింగ్ వాంటాయ్‌ ఫార్మసీ షేర్‌ విలువ 20శాతం కోల్పోవడం వల్ల జోంగ్‌ షాన్‌ రెండో స్థానానికి పడిపోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.