ETV Bharat / business

నేటి నుంచి ఎస్​ బ్యాంకు సేవలు యథాతథం - yes bank news today

కేంద్ర ప్రభుత్వ ఉద్దీపనల అనంతరం ఎస్​ బ్యాంకుపై ఆర్​బీఐ మారటోరియాన్ని నేడు ఎత్తివేయనుంది. ఫలితంగా బ్యాంకు కార్యకలాపాలు ఇవాళ్టి నుంచి యథావిధిగా కొనసాగనున్నాయి. అన్ని ఏటీఎంలు, శాఖల్లో సరిపడా డబ్బు ఉంటుందని, వినియోగదారులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నూతన సీఈఓ ప్రశాంత్​ కుమార్ స్పష్టం చేశారు.

yes bank
ఎస్ బ్యాంకు
author img

By

Published : Mar 18, 2020, 5:31 AM IST

Updated : Mar 18, 2020, 4:42 PM IST

సంక్షోభంలో చిక్కుకున్న ఎస్​ బ్యాంకు ఇవాళ్టి నుంచి యథావిధిగా తన కార్యకలాపాలను కొనసాగించనుంది. ఈ నేపథ్యంలో ద్రవ్య లబ్ధతకు ఎలాంటి సమస్యలు ఉండవని స్పష్టం చేశారు బ్యాంకు నూతన సీఈఓగా నియమితులైన ప్రశాంత్ కుమార్.

భారీ అప్పుల్లో కూరుకుపోయిన ఎస్​ బ్యంకుపై ఈ నెల 5న ఆర్​బీఐ మారటోరియం విధించింది. వినియోగదారులు రూ.50,000 వరకు మాత్రమే నగదు ఉపసంహరణకు అనుమతించింది. బ్యాంకును సంక్షోభం నుంచి బయటకు లాగేందుకు కేంద్రం ఉద్దీపనలు ప్రకటించగా.. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మారటోరియం ఎత్తివేయనుంది ఆర్​బీఐ.

"మేం తగినన్ని చర్యలు తీసుకున్నాం. మా ఏటీఎంలు అన్నింటిలో నగదు కొరత ఉండదు. బ్యాంకు శాఖల్లోనూ సరిపడ డబ్బు ఉంటుంది. కాబట్టి నగదుకు సంబంధించి ఎస్ బ్యాంకు వైపు నుంచి కచ్చితంగా ఎలాంటి సమస్యలు లేవు."

- ప్రశాంత్​ కుమార్​

బ్యాంకు వినియోగదారులెవ్వరూ తమ డిపాజిట్లపై ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు ప్రశాంత్ కుమార్​. బ్యాంకుపై మారటోరియం ఎత్తివేసిన అనంతరం మునుపటిలానే బ్యాంకు సేవలు అన్ని తిరిగి కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: మీ డిపాజిట్లు వెనక్కి తీసుకోవచ్చు

Last Updated : Mar 18, 2020, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.