విండోస్ యూజర్లంతా వెంటనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సూచించింది. వాన్నా క్రై తరహాలో సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున.. వినియోగదారుల డాటా రక్షణకు ఈ అప్డేట్ తప్పనిసరి అని వివరించింది.
మైక్రోసాఫ్ట్ ఇప్పటికే విండోస్ 7, ఎక్స్పీ, విండోస్ సర్వర్ 2003 ఓఎస్‌లకు భద్రతాపరమైన అప్డేట్లు అందుబాటులో ఉంచింది. ఎక్స్పీ, సర్వర్ 2003లకు రక్షణపరమైన బాధ్యతలను గతంలోనే ఉపసంహరించుకున్నప్పటికీ ఇప్పుడు అప్డేట్లు అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం.
ముందు జాగ్రత్త
ఇప్పటివరకు ఎలాంటి సైబర్ దాడుల ఫిర్యాదులు తమకు అందలేదని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. అయితే ఆ ప్రమాదం ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విండోస్ అప్డేట్ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పింది.
విండోస్ 8, 10 సురక్షితమే
విండోస్ 8, విండోస్ 10 ఓఎస్‌లతో పనిచేస్తున్న కంప్యూటర్లు ఈ వైరస్ బారిన పడే అవకాశంలేదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: బాదం, వాల్నట్స్ ధరలు మరో నెల పెరగవ్!