ETV Bharat / business

మెక్రోసాఫ్ట్​ నుంచి రెండు తెరల మడతఫోన్!

స్మార్ట్​ఫోన్​ ప్రపంచంలోకి వచ్చే ఏడాది సర్ఫేస్ సిరీస్​తో రెండు తెరల మడత ఫోన్లు తీసుకురానున్నట్లు ప్రకటించింది దిగ్గజ టెక్​ సంస్థ మైక్రోసాప్ట్​. సరికొత్త ల్యాప్​టాప్​లు, ట్యాబ్​లు, వైర్​లెస్ ఇయర్​బడ్స్​ను అమెరికా న్యూయార్క్​లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించింది.

మెక్రోసాఫ్ట్​ నుంచి రెండు తెరల మడతఫోన్!
author img

By

Published : Oct 3, 2019, 11:38 AM IST

Updated : Oct 3, 2019, 3:05 PM IST

మెక్రోసాఫ్ట్​ నుంచి రెండు తెరల మడతఫోన్!

మైక్రోసాఫ్ట్​ నుంచి రెండు తెరల మడత స్మార్ట్​ఫోన్​లను తీసుకొస్తున్నట్లు తెలిపారు సంస్థ ఉన్నతాధికారులు. సర్ఫేస్​ డ్యుయో, సర్ఫేస్ నియో పేరుతో వచ్చే ఏడాది చివరికి ఇవి అందుబాటులోకి వస్తాయని అమెరికా న్యూయార్క్​లో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. మడతపెట్టి ఉన్నపుడు వీటి పరిమాణం 5.6 అంగుళాలు. తెరిచినప్పుడు 8.3 అంగుళాలకు పెరుగుతుంది.

ఈ రెండు తెరల ఫోన్​లో ఒకేసారి రెండు యాప్​లను ఓపెన్ చేయవచ్చు. లేదా ఒకే యాప్​నూ వాడవచ్చు. ఆ సమయంలో మరో తెర కీబోర్డ్​గా పనిచేస్తుంది.

ఇటీవలే గేలాక్సీ సిరీస్​తో మడత ఫోన్​లను విడుదల చేసింది మొబైల్ దిగ్గజ సంస్థ శాంసంగ్. ఇప్పుడు వీటికి పోటీగా రెండు తెరల మడత ఫోన్​తో రాబోతోంది మైక్రోసాప్ట్.

గతంలో మైక్రోసాఫ్ట్​ నుంచి వచ్చిన స్మార్ట్​ ఫోన్లలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్​ను వినియోగించారు. కొత్తగా రూపొందిస్తున్న రెండు తెరల ఫోన్​లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్​ను ఉపయోగిస్తున్నారు.

వినియోగదారులకు అత్యాధునిక సదుపాయలతో అత్యున్నత సాంకేతిక విలువలు గల డివైస్​లను అందుబాటులోకి తీసుకురావడమే సంస్థ లక్ష్యమని తెలిపారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.

సర్ఫేస్ సిరీస్​ నుంచి కొత్త మోడల్స్​

ఈ కార్యక్రమంలో సర్ఫేస్ సిరీస్​ నుంచి మార్కెట్​లోకి సరికొత్త ల్యాప్​టాప్​లు, ట్యాబ్​లు, కంప్యూటర్లను విడుదల చేసింది మైక్రోసాఫ్ట్​. యాపిల్​, అమెజాన్​, గూగుల్​కు పోటీగా వైర్​లెస్​ ఇయర్​ బడ్స్​ను తీసుకువచ్చింది. వీటి ప్రారంభ ధర 249 డాలర్లు.

సర్ఫేస్ ల్యాప్​టాప్ 3: ఈ కొత్త మోడల్ ల్యాప్​టాప్​.. 13 అంగుళాలు, 15 అంగుళా వేరియెంట్స్​తో​ అందుబాటులో ఉంది. ధర 999 డాలర్లు, 1199 డాలర్లు.

సర్ఫేస్ ప్రొ 7, సర్ఫేస్​ ప్రొ ఎక్స్​ ల్యాప్​టాప్​లను అత్యాధునిక ఫీచర్స్​తో మొబైల్​ ఫోన్ అనుభూతి పొందేలా రూపొందించారు. ప్రొ7 ధర 749 డాలర్లు. ప్రొ-ఎక్స్ ధర 999డాలర్లు.

ఇదీ చూడండి: వాణిజ్య యుద్ధ భయాలతో నష్టాల్లో మార్కెట్లు

AP Video Delivery Log - 0200 GMT News
Thursday, 3 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0133: US NV Democrats Impleachment AP Clients Only 4232937
Candidates slam Trump, defend impeachment inquiry
AP-APTN-0119: Belgium Juncker US AP Clients Only 4232936
Juncker: EU will reciprocate if Trump imposes tariffs
AP-APTN-0106: Venezuela Lomotaxis AP Clients Only 4232739
Venezuelan border town swells with internal migrants
AP-APTN-0058: US TX Guyger Sentence Reaction 2 AP Clients Only 4232934
Jean's mother: 'Dallas needs to clean up inside'
AP-APTN-0051: US Race Policing Poll AP Clients Only 4232933
Poll: Most say police treat whites more fairly
AP-APTN-0019: US NV Beto Guns AP Clients Only 4232932
O'Rourke talks evolution on guns, critiques Dems
AP-APTN-0012: US NV Sanders Reax Democrats AP Clients Only 4232931
Democratic candidates send well wishes to Sanders
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 3, 2019, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.