ETV Bharat / business

టిక్​టాక్ కొనుగోలుకు స్పీడు పెంచిన మైక్రోసాఫ్ట్​

author img

By

Published : Aug 3, 2020, 11:08 AM IST

ఇప్పటికే భారత్​లో నిషేధం ఎదుర్కొంటున్న టిక్​టాక్​ యాప్​ను అమెరికా కూడా బ్యాన్ చేసేందుకు యోచిస్తోంది. ఇదే సమయంలో అమెరికా టిక్​టాక్ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. యాప్​ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో కూడా చర్చించింది మైక్రోసాఫ్ట్. వాటన్నింటిని పరిగణలోకి తీసుకున్నాకే.. టిక్​టాక్​తో ఒప్పందం కుదుర్చుకుంటామని వెల్లడించింది.

Microsoft on Tiktok deal
టిక్​ టాక్ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు

చైనాకు చెందిన టిక్‌టాక్‌ యాప్‌ అమెరికా కార్యకలాపాల్ని కొనుగోలు చేయడంపై దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ అధికారికంగా ప్రకటించింది. యాప్‌ భద్రతపై వ్యక్తమవుతున్న అనుమానాలపై సంస్థ సీఈఓ సత్యనాదేళ్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఆదివారం చర్చించారు. యాప్‌ పనితీరు విషయంలో ట్రంప్‌ లేవనెత్తిన ఆందోళనలపై విస్తృతంగా చర్చించినట్లు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికా సహా కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ యాప్‌ కార్యకలాపాల్ని సొంతం చేసుకునేందుకు యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు బైట్‌డ్యాన్స్‌తో జరుపుతున్న చర్చలు సెప్టెంబరు 15 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

టిక్​ టాక్ నిషేధంపై ట్రంప్ ప్రకటన..

అమెరికాలో టిక్‌టాక్‌ని పూర్తిగా నిషేధిస్తామని ట్రంప్‌ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో భేటీ అయిన నాదేళ్ల యాప్‌ భద్రత, పనితీరు, కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన అంశాల్ని అధ్యక్షుడుకి వివరించారని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అధ్యక్షుడి ఆందోళనల్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని.. వాటన్నింటికీ సరైన పరిష్కారం లభించే విధంగానే కొనుగోలు ఒప్పందం ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకూ ప్రయోజనాలు అందేలా ఒప్పందం ఉంటుందని హామీ ఇచ్చింది. మైనారిటీ వాటాల కోసం ఈ ఒప్పందంలోకి ఇతర సంస్థలనూ ఆహ్వాస్తామని తెలిపింది. దీనిపై వైట్‌హౌస్‌ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

చైనా యాప్​లపై పాంపియో ఆరోపణలు..

అంతకుముందు అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో చైనా యాప్​లపై పలు ఆరోపణలు చేశారు. టిక్‌టాక్‌, వీచాట్‌ సహా చైనాకు చెందిన అనేక యాప్‌లు అమెరికా పౌరుల ప్రయోజనాలకు ప్రమాదకరంగా మారాయని అన్నారు. వినియోగదారుల ఫోన్‌నంబర్లు, చిరునామా, పరిచయాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఈ- కామర్స్‌లో ఇష్టారాజ్యానికిక చెల్లుచీటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.