సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 'బాయ్‌కాట్ చైనా' ఉద్యమం ఊపందుకుంటోంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన 'వోకల్ ఫర్ లోకల్' నినాదానికి మద్దతు పెరుగుతోంది. వీటిని దేశీయ కంపెనీలు క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో ఒకప్పుడు.. మొబైల్ ఫోన్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన 'మైక్రోమాక్స్' ముందు వరుసలో ఉంది. దేశీయ మొబైల్ మార్కెట్లో ప్రస్తుతం చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మైక్రోమ్యాక్సే ప్రత్యామ్నాయంగా చాలా మంది భావిస్తున్నారు. దాన్ని అనుకూలంగా మార్చుకుని తిరిగి సంస్థకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది మైక్రోమ్యాక్స్.
అభిమానులు ట్విట్టర్ ద్వారా పలు ప్రశ్నలు అడగగా.. వాటికి మైక్రోమ్యాక్స్ ఇచ్చిన సమాధానాలతో ఈ విషయం మరోసారి స్పష్టమైంది.
అభిమానులతో మైక్రోమ్యాక్స్ సంభాషణ..
"చైనా ఫోన్లకు ప్రత్యామ్నాయంగా కొత్త మోడళ్లను తీసుకురండి. మీకు ఆ సామర్థ్యం ఉంది. మీరు చేయగలరు. అందుకు ఇదే సరైన సమయం. భారతీయులమంతా మీతో ఉంటూ.. మీకు పూర్తి మద్దతు ఇస్తాం.." ఓ అభిమాని ట్వీట్ చేశారు.
అందుకు మైక్రోమ్యాక్స్ స్పందిస్తూ.. "'వోకల్ ఫర్ లోకల్'కు మద్దతు ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. అంతర్గతంగా కొత్త ఉత్పత్తుల కోసం మేము తీవ్రంగా శ్రమిస్తున్నాం. త్వరలోనే సరికొత్త ఉత్పత్తులతో మీ ముందుకు వస్తాం. " అని ట్వీట్ చేసింది.
-
@Micromax_Mobile plz produce some great alternative of Chinese mobiles. You have great potential and u can do it.
— Hitesh Parekh (@hittu2710) June 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
It is the best time for u and we Indians fully 💪 support you.
Make proud us. Goodluck#BoycottChineseProduct #AtmaNirbharBharat
Jai Hind 🙏🇮🇳
">@Micromax_Mobile plz produce some great alternative of Chinese mobiles. You have great potential and u can do it.
— Hitesh Parekh (@hittu2710) June 17, 2020
It is the best time for u and we Indians fully 💪 support you.
Make proud us. Goodluck#BoycottChineseProduct #AtmaNirbharBharat
Jai Hind 🙏🇮🇳@Micromax_Mobile plz produce some great alternative of Chinese mobiles. You have great potential and u can do it.
— Hitesh Parekh (@hittu2710) June 17, 2020
It is the best time for u and we Indians fully 💪 support you.
Make proud us. Goodluck#BoycottChineseProduct #AtmaNirbharBharat
Jai Hind 🙏🇮🇳
మరో అభిమాని.. "మైక్రోమ్యాక్స్ మీ నుంచి ఏదైనా మిడ్‌రేంజ్ ఫోన్‌ను అశించవచ్చా?" అని ట్విట్ చేశాడు.
దానికి 'ప్రీమియం ఫీచర్లు, మాడ్రన్ లుక్, బడ్జెట్ ధరలో కొత్త మోడల్ త్వరలోనే తీసుకురానున్నట్లు' మైక్రోమ్యాక్స్ సమాధానమిచ్చింది.
-
@Micromax_Mobile can we expect a good midrange killer from you?? #MadeInIndia
— Nani kishor (@Naani61319896) June 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">@Micromax_Mobile can we expect a good midrange killer from you?? #MadeInIndia
— Nani kishor (@Naani61319896) June 18, 2020@Micromax_Mobile can we expect a good midrange killer from you?? #MadeInIndia
— Nani kishor (@Naani61319896) June 18, 2020
కొత్త ఉత్పత్తులతో రానున్నామని చెప్పిన మైక్రోమ్యాక్స్.. వాటి వివరాలు మాత్రం వెల్లడించలేదు.
కొత్త ఉత్పత్తులు ఇలా..
మైక్రోమ్యాక్స్ ట్వీట్లతోపాటు పలు టెక్ వార్తా సంస్థలు సేకరించిన సమచారం ప్రకారం.. త్వరలోనే ఈ కంపెనీ నుంచి మూడు కొత్త స్మార్ట్ఫోన్లు రానున్నాయి. చైనా కంపెనీలను దీటుగా ఎదుర్కొనేందుకు ఈ మోడళ్లను తీసుకురానుంది. ఈ మూడు ఫోన్ల ధరలు రూ.10,000 కన్నా తక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది.
సవాళ్లు..
ప్రస్తుత పరిస్థితుల్లో వినియోదారులను ఆకర్షించేందుకు మైక్రోమ్యాక్స్ ప్రయత్నాలు చేయొచ్చు. అయితే మార్కెట్లో ఇప్పుడు అనేక సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా 5 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు దేశవ్యాప్తంగా 75 శాతం మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఇది మైక్రోమ్యాక్స్‌కు ప్రధాన అడ్డంకిగా మారొచ్చని నిపుణులు అంటున్నారు.
ఇదీ చూడండి:'బాయ్‌కాట్ చైనా' సాధ్యమేనా? లాభదాయకమేనా?