ETV Bharat / business

మార్కెట్లోకి సరికొత్తగా 'మారుతీ బాలెనో'- ధరెంతంటే..?

author img

By

Published : Feb 23, 2022, 3:54 PM IST

Maruti Suzuki Baleno: మారుతీ సుజుకీ బాలెనో న్యూ వెర్షన్​ విపణిలోకి విడుదలైంది. ప్రస్తుతమున్న ఫీచర్ల కంటే ఇంకా ఎక్కువగానే కొత్త మోడల్​లో అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ తెలిపింది. దీని ధరను రూ.6.35లక్షల నుంచి రూ.9.49 లక్షల మధ్య నిర్ణయించింది.

maruti suzuki baleno
maruti suzuki baleno

Maruti Suzuki Baleno: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మార్కెట్​లోకి ప్రీమియం హ్యాచ్​బాక్​ బాలెనో న్యూ వెర్షన్​ను విడుదల చేసింది. దీని ధర రూ.6.35లక్షల నుంచి రూ.9.49 లక్షల(ఎక్స్​ షోరూమ్​) మధ్య ఉండనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వినియోగదారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి బాలెనోను సరికొత్తగా తీర్చిదిద్దినట్లు కంపెనీ పేర్కొంది. బాలెనోను రెండు వేరియంట్లలో అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపింది.

  • మాన్యువల్ గేర్​బాక్స్​ వేరియంట్​ ధర రూ.6.35 లక్షల నుంచి రూ.8.99 లక్షల మధ్య ఉంటుంది.
  • ఆటో గేర్​ షిఫ్ట్​ వేరియంట్​ ధర రూ.7.69 లక్షల నుంచి రూ.9.49 లక్షల మధ్య ఉండనుంది.

"సాంకేతికత, ఆవిష్కరణలపై దృష్టి సారించి.. బాలెనోను అనేక అత్యాధునిక ఫీచర్లతో శక్తిమంతంగా తయారు చేశాం. సరికొత్తగా తీర్చిదిద్దిన బాలెనో సాంకేతికత, ఫీచర్లతో పాటు ప్రీమియం ఇంటీరియర్స్, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాం. ఈ సెగ్మెంట్​లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫీచర్ల కంటే ఇంకా ఎక్కువగానే జత చేశాం" అని మారుతీ సుజుకీ ఎండీ, సీఈఓ కెనిచీ అయుకవా తెలిపారు.

బాలెనోను సరికొత్త హంగులు దిద్దడానికి దాదాపు రూ.1,150 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు అయుకవా తెలిపారు. ఇది తమ మార్కెట్​ విస్తరణకు దోహదపడుతుందన్నారు. ఎలక్ట్రానిక్ చిప్​ల కొరత, ముడిపదార్థాల ధరల పెరుగుదలతో సవాలు ఎదుర్కొనట్లు తెలిపిన ఆయన.. ప్రస్తుతం ఆ సమస్యలను క్రమంగా అధిగమిస్తున్నట్లు చెప్పారు.

మాన్యువల్ గేర్​బాక్స్​ వేరియంట్​ 22.3కిలోమీటర్లు, ఆటో గేర్​ షిఫ్ట్​ వేరియంట్​ 22.9 కిలోమీటర్ల మైలేజ్​తో వస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

బాలెనోను 2015లో విడుదల చేసింది మారుతీ సుజుకీ. దీనికి ఎప్పటికప్పుడు కొత్త హంగులను దిద్ది మార్కెట్లోకి తీసుకొస్తోంది.

ఇదీ చూడండి: ఉక్రెయిన్​పై యుద్ధ మేఘాలు... మనపై ప్రభావమెంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.