దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా.. ఆన్లైన్ మాద్యమం ద్వారా 2 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది.
దాదాపు రెండేళ్ల క్రితం ఆన్లైన్ విక్రయాలు ప్రారంభించింది మారుతీ సుజుకీ. దేశవ్యాప్తంగా ప్రస్తుతం వెయ్యి డీలర్‌షిప్‌లను ఆన్‌లైన్‌కు అనుసంధానం చేసింది.
గత ఏడాది ఏప్రిల్ నుంచి డిజిటల్ ఎంక్వైరీలు మూడు రెట్లు పెరగగా.. దాదాపు 2 లక్షల యూనిట్లు విక్రయించామని మారుతీ సుజుకీ పేర్కొంది. దాదాపు 21 లక్షలకుపైగా వినియోగదారుల సందేహాలను తీర్చేందుకు మాధ్యమం ఉపయోగపడిందని తెలిపింది.
'గూగుల్ ఆటో గెయిర్ షిఫ్ట్ ఇండియా 2020' నివేదిక ప్రకారం.. 95 శాతం కొత్త కార్ల విక్రయాలు డిజిటల్‌గా ప్రభావితమవుతున్నట్లు వివరించింది మారుతీ. వినియోగదారులు ముందు ఆన్లైన్లో కావాల్సిన మోడల్ గురించి తెలుసుకొని.. ఆఫ్‌లైన్ డీలర్‌షిప్‌లలో కొనుగోళ్లు జరుపుతున్నారని వెల్లడించింది. కొవిడ్ 19 ప్రభావంతో.. గడిచిన ఐదు నెలల్లో ఆన్లైన్ ఎంక్వైరీలు 33 శాతం పెరిగినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి:డీజిల్ మోడళ్ల కొనసాగింపునకే హ్యుందాయ్ మోటర్స్ మొగ్గు