ETV Bharat / business

కొత్త హంగులతో మారుతి 'ఇగ్నిస్'​ బీఎస్​-6 కారు - maruti ignis 2020 model

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ.. ఇగ్నిస్‌ మోడల్‌లో సరికొత్త వెర్షన్‌ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎస్​-6 ప్రమాణాలతో పాటు ఇగ్నిస్​కు పలు కొత్త అంశాలను జోడించింది సంస్థ.

maruti, ignis
ఇగ్నిస్​ కారు
author img

By

Published : Feb 18, 2020, 2:58 PM IST

Updated : Mar 1, 2020, 5:44 PM IST

భారత్​లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి.. ప్రముఖ మోడల్​ ఇగ్నిస్​లో బీఎస్​-6 వాహనాన్ని విడుదల చేసింది. దీని ధర రూ.4.89 నుంచి 7.19 లక్షల మధ్య ఉంటుందని నిర్ణయించింది.

ఈ కొత్త ఇగ్నిస్​లో 1.2 లీటర్ల పెట్రోల్​ ఇంజిన్​ సామర్థ్యాన్ని కల్పించామని సంస్థ తెలిపింది. మాన్యువల్​తో పాటు ఆటో గేర్​ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. క్రోమ్‌ గ్రిల్‌, సరికొత్త బంపర్‌, స్కిడ్‌ ప్లేట్లు, దీంతో పాటు రూఫ్‌ రెయిల్స్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఎస్​యూవీలకు ఆదరణ పెరుగుతోందని.. అందువల్ల కొత్త ఇగ్నిస్​ను ఎస్​యూవీ తరహాలోనే తయారు చేశామని తెలిపింది మారుతి. ఈ కొత్త మోడల్‌ ఆరు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. వీటిల్లో లూసెంట్‌ ఆరెంజ్‌, న్యూ టర్కోయిస్‌ రంగులు ఉన్నాయి. డ్యూయల్‌ టోన్‌ ఆప్షన్లలోనూ లభిస్తోంది.

మాన్యువల్​ గేర్​ సిస్టమ్​ మోడల్​లో మొత్తం 4 వేరియంట్లలో లభించే ఇగ్నిస్ ధర.. రూ.4.89 - రూ.6.73 లక్షల మధ్య నిర్ణయించింది సంస్థ. ఆటోగేర్​ సిస్టమ్​లో రూ.6.13 - రూ.7.19 లక్షల మధ్య లభిస్తాయి.

Last Updated : Mar 1, 2020, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.