ETV Bharat / business

అక్టోబర్​లో మారుతీ, హ్యుందాయ్​ జోరు.. రెండంకెల వృద్ధి - festive season sales

పండుగల సీజన్​లో మారుతీ సుజూకీ ఇండియా, హ్యుందాయ్​ మోటర్స్​ ఇండియాలు దూసుకెళ్లాయి. అక్టోబర్​లో వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. వాటితో పాటు హోండా కార్స్​, టొయోటా, ఎంఅండ్​ఎం కూడా మంచి ఫలితాలు రాబట్టాయి.

Autosales
అక్టోబర్​లో మారుతీ, హ్యుందాయ్​ జోరు
author img

By

Published : Nov 1, 2020, 9:34 PM IST

పండుగ సీజన్​లో కార్లు, ఇతర ప్రయాణ వాహనాల విక్రయాలు భారీగా పెరిగాయి. మారుతీ సుజూకీ ఇండియా, హ్యుందాయ్​ మోటర్స్​ ఇండియాలు జోరు కనబరిచాయి. అక్టోబర్​లో ఏకంగా రెండంకేల వృద్ధిని నమోదు చేశాయి. వాటితో పాటు హోండా కార్స్​ ఇండియా, టొయోటా కిర్లోస్కర్​ మోటర్స్​, మహీంద్రా అండ్​ మహీంద్రాలు కూడా దేశీయ ప్రయాణ వాహనాల విక్రయాల్లో వృద్ధి నమోదు చేశాయి.

మారుతీ సుజూకీ..

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజూకీ ఇండియా (ఎంఎస్​ఐ) 2019, అక్టోబర్​(1,44,277 యూనిట్స్​) తో పోలిస్తే.. ఈ ఏడాది అక్టోబర్​లో 19.8 శాతం వృద్ధితో 1,72,862 వాహనాలు విక్రయించినట్లు ప్రకటించింది. అయితే.. సంస్థ చిన్న కార్లు ఆల్టో, ఎస్​-ప్రెస్సో వంటి విక్రయాల్లో స్వల్ప క్షీణత నమోదైంది. గత ఏడాది అక్టోబర్​లో 28,537 యూనిట్లు విక్రయించగా.. ఈసారి 28,462 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

స్విఫ్ట్​, సెలేరియో, ఇగ్నైస్​, బలేనో, డిజైర్​​ వంటి కార్లు 19.2 శాతం వృద్ధితో 95,067 వాహనాలు అమ్ముడయ్యాయి. యుటిలిటీ వెహికిల్స్​లో విటారా బ్రెజా, ఎస్​-క్రాస్​, ఎర్టిగాలు కూడా 9.9 శాతం వృద్ధితో 25,396 యూనిట్లు విక్రయమయ్యాయి.

హ్యుందాయ్​ మోటర్స్​..

హ్యుందాయ్​ మోటర్స్​ దేశీయ మార్కెట్​లో.. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్టోబర్​లో రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు చేసింది. 2019, అక్టోబర్​ (50,010 యూనిట్లు)తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్​లో 13.2 శాతం వృద్ధితో 56,605 వాహనాలు విక్రయించింది. 2018, అక్టోబర్​లో అత్యధికంగా 52,001 యూనిట్లను విక్రయించగా.. తాజాగా ఆ రికార్డును తిరగరాసింది.

వివిధ సంస్థల విక్రయాలు ఇలా ఉన్నాయి.

సంస్థ 2020, అక్టోబర్​2019, అక్టోబర్వృద్ధి (శాతంలో)
మారుతీ1,72,8621,44,27719.8
హ్యుందాయ్56,60550,01013.2
హోండా10,836-8.3
టొయోటా12,37311,8664.27
ఎంఅండ్​ఎం18,62218,4601
ఎంజీ3,7503,5366

ద్విచక్ర వాహనాల్లో..

ద్విచక్రవాహనాల విక్రయాల్లో హీరో మోటోకార్ఫ్​ జోరు కనబరిచింది. అక్టోబర్​లో రికార్డు స్థాయిలో 8,06,848 యూనిట్లు విక్రయించింది. 2019, అక్టోబర్​ ( 5,99,248 యూనిట్లు) తో పోలిస్తే 34.64 శాతం వృద్ధి నమోదు చేసింది.

మరోవైపు.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ 7 శాతం వృద్ధితో 62,858 యూనిట్లు విక్రయించినట్లు సంస్థ ప్రకటించింది.

ఇదీ చూడండి: దసరా వేళ కార్ల విక్రయాలు భళా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.