పరారీలో ఉన్న రుణఎగవేతదారు, భారతీయ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్కు తీసుకొచ్చే అంశమై న్యాయపరమైన ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. ఆయనను ఎప్పుడైనా భారత్కు తీసుకొచ్చే అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు చెందిన ఓ అధికారి అనధికారికంగా వెల్లడించినట్లు సమాచారం.
ప్రక్రియ షురూ..
సీబీఐ, ఈడీ మాల్యాను వెనక్కి తెచ్చేందుకు ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించాయి. భారత్కు వచ్చిన వెంటనే కస్టడీకి తీసుకోవాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. అయితే మాల్యాను ఎప్పుడు వెనక్కి తీసుకొస్తారనే అంశమై స్పష్టత లేదని తెలుస్తోంది.
మే 14నే మార్గం సుగమం..
మే 14న బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానంలో.. తనని భారత్కు అప్పగించకూడదన్న మాల్యా అప్పీలు వీగిపోయిన సమయంలోనే మాల్యాను భారత్కు తెచ్చే అంశమై మార్గం సుగమమైంది.
17 భారతీయ బ్యాంకులకు రూ. 9,000కోట్ల రుణాలను ఎగవేశారు మాల్యా. ఈ మొత్తంతో 40 విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని అభియోగాలు ఉన్నాయి.
ఇదీ చూడండి: చిన్నారి కష్టం: సోదరుడిని వెతకలేక.. తల్లిని విడవలేక..