ETV Bharat / business

మార్చిలో భారీగా పెరిగిన వాహన విక్రయాలు!

దేశీయంగా ప్రయాణ వాహన విక్రయాలు ఈ ఏడాది మార్చిలో భారీగా పెరిగాయి. ప్రధాన ఆటోమోబైల్​ కంపెనీల విక్రయాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. ద్విచక్ర వాహన అమ్మకాల్లోనూ సానుకూల ఫలితాలు కనిపించాయి.

Major auto cos log robust sales in March
ఆటోమోబైల్​ కంపెనీల విక్రయాలు
author img

By

Published : Apr 2, 2021, 5:21 AM IST

కరోనా నేపథ్యంలో వ్యక్తిగత వాహనాలు ఉండాలన్న ప్రజల ఆలోచన, డిమాండ్ పెరుగదలతో ఈ ఏడాది మార్చి నెలలో ప్రధాన ఆటోమోబైల్ కంపెనీల విక్రయాలు భారీగా పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యూందాయ్​, టాటా మోటర్స్ వంటి కంపెనీల​ విక్రయాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది.

  • భారత్‌లోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ దేశీయ విక్రయాలు 2020 మార్చిలో 70,976 ఉండగా, 2021 మార్చిలో అవి రెట్టింపై 1,49,518కు చేరుకున్నాయి.
  • టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహన విక్రయాలు 2020 మార్చిలో కేవలం 5,676 ఉండగా, ఈ ఏడాది మార్చిలో అవి ఏకంగా 29,654 నమోదు చేశాయి.
  • హ్యూందాయ్​ మోటర్స్​ ఇండియా 2020-21 మార్చిలో 52,600 వాహనాలు విక్రయించింది. అది గత ఏడాది మార్చిలో 26,300లు మాత్రమే ఉంది.
  • టొయోటా కిర్లోస్కర్​ మోటర్స్​.. ఈ ఏడాది మార్చిలో 15,001 యూనిట్లు విక్రయించినట్లు ప్రకటించింది. 2013 నుంచి మార్చి నెల విక్రయాల్లో ఇదే అత్యధికమని తెలిపింది. 2020 మార్చిలో 7,023 యూనిట్లు అమ్మింది.

2019-20 ఆర్థిక సంవత్సరంలో కార్ల అమ్మకాలు 1,31,196 ఉండగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో అవి 2,22,25కు చేరుకున్నాయి. గత ఏడాది మార్చిలో మినీ కార్ల అమ్మకాలు 15,988 జరగగా, 2021 మార్చిలో అవి 24,653కు పెరిగాయి.

మొత్తం దేశీయ వాహనాలు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 14,36,124 ఉండగా, కరోనా కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో అవి 13,23,396కు పడిపోయినట్లు మోటారు వాహన విక్రయ సంఘం ఎంఎస్​ఐ ఓ ప్రకటనలో తెలిపింది.

ద్విచక్రవాహనాల్లో..

ద్విచక్రవాహన విభాగంలో హీరో మోటోకార్ఫ్​ దేశీయ మార్కెట్లో 5,44,340 యూనిట్లు విక్రయించినట్లు ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో 3,16,685 వాహనాలు మాత్రమే అమ్మినట్లు తెలిపింది.

టీవీఎస్​ మోటర్స్​ దేశీయ మార్కెట్లో గత మార్చిలో 2,02,155 వాహనాలు విక్రయించగా.. 2020, మార్చిలో 94,103గా ఉంది.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఈ ఏడాది మార్చిలో దేశీయ మార్కెట్లో 60,173 వాహనాలు విక్రయించగా.. గత ఏడాది అది 32,630గా ఉంది.

ఇదీ చూడండి: ఫాస్టాగ్​​పై ఐసీఐసీఐ బ్యాంక్​, ఫోన్​పే ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.