ETV Bharat / business

దీపావళి కానుకగా మహీంద్ర సరికొత్త 'థార్​'

దీపావళి కానుకగా మహీంద్ర అండ్ మహీంద్ర సరికొత్త హంగులతో రూపొందించిన థార్​ ఇళ్లకు చేరబోతోంది. ఈ నెల 7,8 తేదీల్లో 500 కార్లను వినియోగదారులకు అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

Mahindra Thar
థార్​
author img

By

Published : Nov 7, 2020, 1:02 PM IST

సరికొత్త హంగులతో మార్కెట్లోకి వచ్చిన మహీంద్ర అండ్‌ మహీంద్రా థార్‌ దీపావళి కానుకగా ఇళ్లకు చేరబోతోంది. ఈ నెల 7,8 తేదీల్లో 500 కార్లను వినియోగదారులకు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. రెండు వేరియంట్లకు లభించిన బుకింగ్‌ క్రమాన్ని బట్టి అందిస్తామని వెల్లడించింది. సెప్టెంబరులో నిర్వహించిన వేలంలో అత్యధిక పాట పాడిన వ్యక్తికి థార్ తొలి యూనిట్‌ను అందించారు.

థార్‌ కొత్త వెర్షన్‌ను ఎంఅండ్‌ఎం అక్టోబర్‌ 2న ఆవిష్కరించిన విషయం తెలిసిందే. నెలకు 2000 యూనిట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. జనవరి నాటికి దీన్ని మూడు వేలకు పెంచాలని నిర్ణయించారు. విడుదలైన ఒక్క నెల వ్యవధిలోనే 20,000 బుకింగ్స్‌ వచ్చినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇవీ కొత్త థార్‌ ప్రత్యేకతలు..

డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయకపోయినా.. అదనపు హంగులను సమకూర్చింది. సరికొత్త ఎల్‌ఈడీ టెయిల్‌ లైట్లు, అలాయ్‌ వీల్స్‌, ఫ్రంట్‌ ల్యాంప్స్‌ను ఇచ్చింది. ఈ కారులో సాఫ్ట్‌టాప్‌, హార్డ్‌టాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కారు బాడీ ఫ్రేమ్‌ సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించడం విశేషం.

పూర్తి నలుపు రంగు క్యాబిన్‌, స్పోర్టీ సీట్లను అందజేసింది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌‌ ఆటో వాయిస్‌ కమాండ్‌ ఆప్షన్‌ను అనుసంధానించింది. దీనిలో స్విచ్‌లు ఐపీ 54 ధ్రువీకరణ పొందాయి. వీటిపై దుమ్ము, నీరు నిలవవు. కారు రూఫ్‌కు అమర్చిన స్పీకర్లు, రియర్‌ వ్యూ కెమెరా, టిల్ట్‌ అడ్జెస్టింగ్‌ స్టీరింగ్‌, ఆడియో కంట్రోల్‌, క్రూజ్‌ కంట్రోల్‌, పవర్‌ ఫోల్డింగ్‌ మిర్రర్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మొత్తం ఆరు రంగుల్లో లభిస్తుంది. రెండు సిరీసుల్లో మూడేసి వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లను అమర్చారు. కారులో బీఎస్‌6 2.2లీటర్‌ ఎంహాక్‌ డీజిల్‌ , 2.0 లీటర్‌ ఎం స్టిలియోన్‌ ఇంజిన్‌ను అమర్చారు. డీజిల్‌ వెర్షన్‌ 130 బీహెచ్‌పీ, పెట్రోల్‌ వెర్షన్‌ 150 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తాయి. 6స్పీడ్‌ మాన్యూవల్‌, 6 స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను అందించారు. వీటి ధరల శ్రేణి రూ.9.8 లక్షల నుంచి రూ.13.75 లక్షల మధ్య ఉంది.

ఇదీ చూడండి: మార్కెట్లోకి ఐ20 కొత్త మోడల్​- ధర, ఫీచర్లు ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.