ETV Bharat / business

బ్రాండ్‌ బాజా- అగ్రశ్రేణి విలాస వస్తువుల కంపెనీల్లో మనవి 5

author img

By

Published : Dec 15, 2021, 7:21 AM IST

Luxury brands in India: ప్రపంచంలోని అగ్రశ్రేణి విలాస బ్రాండ్ల జాబితాలో భారత్ నుంచి ఐదు కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. టాటా గ్రూప్​నకు చెందిన టైటాన్ 22వ స్థానంలో నిలిచింది. మరో నాలుగు వజ్రాభరణాల సంస్థలూ ఈ జాబితాలో ర్యాంకులు సాధించాయి.

luxury goods ranks
విలాస వస్తువుల కంపెనీలు

Luxury brands in India: అంతర్జాతీయంగా వినియోగిస్తున్న 100 అగ్రశ్రేణి విలాస వస్తువుల బ్రాండ్లలో మన దేశానివి 5 ఉన్నాయని డెలాయిట్‌ నివేదిక వెల్లడించింది. టాటా గ్రూప్‌నకు చెందిన టైటన్‌ 3 స్థానాలు మెరుగుపర్చుకుని 22వ ర్యాంకు సొంతం చేసుకుందని తెలిపింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న 20 బ్రాండ్లలో ఒకటిగా టైటన్‌ నిలిచింది.

Deloitte luxury report 2021

Luxury brands list

'డెలాయిట్‌ గ్లోబల్‌ 2021 ఎడిషన్‌ ఆఫ్‌ గ్లోబల్‌ పవర్స్‌ ఆఫ్‌ లగ్జరీ గూడ్స్‌' జాబితాలో కల్యాణ్‌ జువెలర్స్‌, జోయలుక్కాస్‌, పీసీ జువెలర్స్‌, త్రిభువన్‌దాస్‌ భీమ్‌జీ జవేరి లిమిటెడ్‌లు వరుసగా 37, 46, 57, 92 ర్యాంకులు దక్కించుకున్నాయి. భారత్‌ నుంచి చూస్తే గతంలో మాదిరే వజ్రాభరణాల విభాగమే ఆధిపత్యం కొనసాగిస్తోంది. త్రిభువన్‌దాస్‌ భీమ్‌జీ జవేరి తొలిసారిగా 100 విలాస వస్తువుల తయారీ కంపెనీలో చోటు సంపాదించింది.

Top luxury brands in the world

అంతర్జాతీయంగా ఈ 100 సంస్థల ఆదాయం 25,200 కోట్ల డాలర్ల (సుమారు రూ.18,90,000 కోట్ల)ని నివేదిక తెలిపింది. 'భారతీయ ఆభరణాల రిటైలర్లపై అంతర్జాతీయంగా మంచి నమ్మకం ఉంది. టీకాల కార్యక్రమం ఊపందుకోవడం, కొవిడ్‌-19 కేసులు తగ్గడంతో ఈ ఏడాది పండుగల సీజన్‌లో గిరాకీ బాగా పెరిగింది. భారతీయ బ్రాండ్లు తమ బలాలపై ఆధారపడ్డాయి. వృద్ధి కోసం ఆన్‌లైన్‌ పరిష్కారాల్ని కూడా కనుగొన్నాయ'ని డెలాయిట్‌ టచ్‌ తొహ్‌మాత్సు ఇండియా ఎల్‌ఎల్‌పీ పార్ట్‌నర్‌, కన్జూమర్‌ ఇండస్ట్రీ లీడర్‌ పోరస్‌ డాక్టర్‌ వెల్లడించారు. భారత్‌, చైనాల నుంచి 14 జువెలరీ రిటైలర్‌ సంస్థలు టాప్‌-100లో ఉన్నాయి.

తొలి 10 స్థానాల్లో ఐరోపా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలకు చెందిన ఎల్‌వీఎంహెచ్‌ మోయెత్‌ హెనెసి-లూయిస్‌ విటన్‌ ఎస్‌ఈ, కేరింగ్‌ ఎస్‌ఏ, క్యాప్రి హోల్డింగ్స్‌, కంపనీ ఫినాన్సిర్‌ రిచ్‌మాంట్‌, లోరెల్‌ లక్స్‌, చానెల్‌ లిమిటెడ్‌, ఎసిలార్‌ లగ్జోటికా, హెర్మెస్‌ ఇంటర్నేషనల్‌ ఉన్నాయి.

ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ చేతికి రీబాక్‌

అంతర్జాతీయ స్పోర్ట్స్‌వేర్‌ బ్రాండ్‌ రీబాక్‌ భారత కార్యకలాపాలను ఇకపై కుమార మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ (ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌) చేపట్టనుంది. ఇందుకోసం న్యూయార్క్‌కు చెందిన అథెంటిక్‌ బ్రాండ్‌ గ్రూప్‌తో దీర్ఘకాల లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్‌, ఏషియాన్‌ దేశాల్లో రీబాక్‌ మార్కెటింగ్‌, బ్రాండింగ్‌ హక్కులు అథెంటిక్‌ బ్రాండ్‌ గ్రూప్‌ చేతిలో ఉన్నాయి. ఈ వ్యూహాత్మక ఒప్పందంతో హోల్‌సేల్‌, ఇ-కామర్స్‌, రీబాక్‌ బ్రాండెడ్‌ రిటైల్‌ సోర్ల ద్వారా రీబాక్‌ ఉత్పత్తుల పంపిణీ, విక్రయించే ప్రత్యేక హక్కులను ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌ పొందనుంది. 2022 మొదటి త్రైమాసికానికి ఈ లావాదేవీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ఒప్పందంతో దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న స్పోర్ట్స్‌, యాక్టివ్‌ వేర్‌ విభాగంలోకి ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌ అడుగుపెట్టనుంది. ఈ విభాగం అమ్మకాలు 2023-24కు 14% వార్షిక వృద్ధి రేటుతో 1300కోట్ల డాలర్ల (సుమారు రూ.97,500 కోట్ల)కు చేరే అవకాశం ఉందని అంచనా.

చానెల్‌ గ్లోబల్‌ సీఈఓగా లీనా నాయర్‌

ఫ్రెంచ్‌ విలాసవంత ఉత్పత్తుల సంస్థ చానెల్‌కు గ్లోబల్‌ సీఈఓగా భారతీయురాలు లీనా నాయర్‌ (52) నియమితులయ్యారు. మహారాష్ట్రలోని కొల్హాపుర్‌కు చెందిన ఆమె ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ తర్వాత ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ (జెంషెడ్‌పూర్‌)లో ఎంబీఏ (1990-92) పూర్తి చేసి బంగారు పతకం సాధించారు. 1992లో హిందుస్థాన్‌ యునిలీవర్‌లో (హెచ్‌యూఎల్‌) మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా చేరిన లీనా అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం యునిలీవర్‌ ముఖ్య మానవ వనరుల అధికారిగా, యునిలీవర్‌ లీడర్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యురాలిగా ఉన్నారు. చానెల్‌ గ్లోబల్‌ సీఈఓగా 2022 జనవరిలో చేరనున్నారు.

ఇదీ చదవండి: టెక్‌ కంపెనీలను వణికిస్తున్న జీరోడే 'లాగ్‌4జే'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.