మౌలిక వసతుల సంస్థ లార్సెన్ టూబ్రో (ఎల్&టీ) మరో భారీ ప్రాజెక్టును దక్కించుకుంది. ముంబయి-అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ (బుల్లెట్ ట్రైన్) నిర్మాణంలో భాగమైన ప్రాజెక్టు చేజిక్కించుకున్నట్లు ప్రకటించింది.
ఎంత మొత్తానికి ఈ ప్రాజెక్టును దక్కించుకుందనే విషయాన్ని మాత్రం ఎల్&టీ వెల్లడించలేదు. ఇప్పటి వరకు ఉన్న వివరాల ప్రకారం ప్రాజెక్ట్ విలువ రూ.7,000 కోట్లు అని తెలిసింది.
87.569 కిలో మీటర్లకు సంబంధించిన ఈ ప్రాజెక్ట్ పరిధిలో చిన్న వంతెనలు, ఒక స్టేషన్, నదిపై ఓ ప్రధాన బ్రిడ్జ్ నిర్మాణాలు సహా డిపోల నిర్వహణ వాటి అనుబంధ పనులు ఉన్నాయి.