ETV Bharat / business

బడ్జెట్​పై కసరత్తు చేసే బృందంలో ఎవరెవరు? - ఆర్థిక మంత్రి

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం తొలి సార్వత్రిక బడ్జెట్​ను ప్రవేశపెట్టనుంది. వచ్చే నెల 5న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. ఈ మేరకు బడ్జెట్​ రూపకల్పనకు కసరత్తులు ముమ్మరం చేశారు ఆర్థిక శాఖ నిపుణులు.

బడ్జెట్​పై కసరత్తు
author img

By

Published : Jun 19, 2019, 6:11 PM IST

బడ్జెట్​పై కసరత్తు చేసే బృందంలో ఎవరెవరు?

సార్వత్రిక ఎన్నికల తర్వాత మోదీ 2.0 ప్రభుత్వం వచ్చే 5న తొలి వార్షిక బడ్జెట్​ను ప్రవేశపెట్టనుంది. ఈసారి పూర్తి స్థాయి ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. ఒకసారి ఈ బడ్జెట్ అమోదం పొందితే ఎన్నికల ముందు అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్​ రద్దు కానుంది.

చాలా మందికి తెలియని విషయమేంటంటే.. దేశ వ్యాప్తంగా వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం బడ్జెట్​ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారని.

ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల బృందం వరుస సమావేశాలతో బడ్జెట్​ రూపకల్పనపై తుది కసరత్తు చేస్తోంది. ఎవరు ఆ సభ్యులు? వారి కర్తవ్యాలేంటో తెలుసుకుందాం పదండి.

1. నిర్మలా సీతారామాన్​, ఆర్థిక మంత్రి

నిర్మలా సీతారామన్​ మొదటి సారి పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు ఆమె ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ప్రస్తుత బడ్జెట్​ను రూపొందించడంలో పూర్వ అనుభవం ఆమెకు కలిసిరానుంది.

ఆర్థిక మంత్రిగా నిర్మాలా సీతారామన్ బడ్జెట్​ రూపొందించి.. పార్లమెంటులో ప్రవేశపెట్టడం ప్రధాన కర్తవ్యం. ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీలు అమలయ్యేలా బడ్జెట్ రూపంలో వాటి అమలు బాధ్యత ఆమెపై ఉంది.

2.అనురాగ్​సింగ్​ ఠాకూర్​, ఆర్థిక శాఖ సహాయ మంత్రి

ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక మంత్రికి సహాయం చేయడం ఠాకూర్ ప్రధాన కర్తవ్యం. ఆర్థిక మంత్రి అందుబాటులో లేనప్పుడు ఆమె స్థానంలో బడ్జెట్​ వాటాదారులతో సమావేశాలు నిర్వహించడం వంటివి చేస్తారు.

హిమాచల్ ప్రదేశ్ నుంచి నాలుగో సారి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన ఠాకూర్ గతంలో బీసీసీఐ అధ్యక్షునిగా కూడా పని చేశారు.

3.కృష్ణ మూర్తి సుబ్రమణియన్, ప్రధాన ఆర్థిక సలహాదారు

ప్రధాన ఆర్థిక సలహాదారుగా సుబ్రమణియన్ బడ్జెట్​ రూపకల్పనకు అవసరమైన సర్వేలు నిర్వహించాలి. ఈ సర్వేలను పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెడతారు.
సుబ్రమణియన్ ఐఐటీ, ఐఐఎంల పట్టభధ్రుడు. ప్రభుత్వంలో చేరకముందు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్​లో పని చేశారు.

4.సుభాశ్​చంద్ర గార్గ్, ఆర్థిక కార్యదర్శి

ఆర్థిక శాఖలో సుభాశ్​చంద్ర గార్గ్ సీనియర్ ప్రభుత్వ ఉద్యోగి. ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచనల మేరకు బడ్జెట్ రూపొందించడం ఈయన ప్రధాన కర్తవ్యం.

రాజస్థాన్​ క్యాడెర్​ నుంచి ఐఏఎస్​గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన గార్గ్​ క్వాలిఫైడ్ కంపెనీ కార్యదర్శి కూడా. ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డెరెక్టర్​గా పని చేసిన అనుభవం కూడా గార్గ్​కు ఉంది.

5. గిరీశ్​చంద్ర ముర్ము, వ్యయాల కార్యదర్శి

గుజరాత్ క్యాడెర్​ ఐఏఎస్​ అధికారి గిరీశ్ చంద్ర ముర్ము బడ్జెట్​లో వ్యయాల అంచనాలకు బాధ్యత వహిస్తారు. వివిధ మంత్రిత్వ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలు తీసుకుని.. వాటి అమలుకు కావాల్సిన మొత్తాల అంచనాను బడ్జెట్​కు అందిస్తారు.

గిరీశ్ చంద్ర ముర్మును ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితునిగా చెబుతుంటారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీకి ప్రధాన కార్యదర్శిగా పని చేశారు గిరీశ్​.

6.అజయ్ భూషణ్​ పాండే, ఆదాయ కార్యదర్శి

పన్నులు, సుంకాలేతర ఆదాయ మార్గాలను మదింపు చేసి బడ్జెట్​ రూపకల్పనకు కావాల్సిన అంచనాలు అందించడమే ఆదాయ కార్యదర్శిగా పాండే ప్రధాన కర్తవ్యం.
ఆర్థిక మంత్రిత్వ శాఖలో పని చేయకముందు ఆధార్​ జారీ చేసే యూనిక్​ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఈఓగా, జీఎస్​టీ నెట్​వర్క్ ఛైర్మన్​గా పని చేశారు పాండే.

ఇదీ చూడండి: జూన్​ 22న ఆర్థిక వేత్తలతో మోదీ భేటీ

Intro:Body:

The pan-India exercise is overseen by a six-member strong core team sitting in North Block in New Delhi.

Hyderabad: The first budget in the second innings of the Narendra Modi government will be presented to the Lok Sabha on 5 July.

Once approved, the General Budget will replace the Interim Budget presented by the then finance minister Piyush Goyal ahead of the elections.

As many of you may not be aware, the preparation of the Budget involves thousands of Central government employees working across the country.

The pan-India exercise is overseen by a six-member strong core team sitting in North Block in New Delhi. Let us find out who are they.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.