ETV Bharat / business

వచ్చే వారం ఐపీఓకు కిమ్స్, దొడ్ల డెయిరీ - విజయా డయాగ్నోస్టిక్స్ ఐపీఓ

ఈ నెలలో తెలుగు రాష్ట్రాల నుంచి రెండు సంస్థలు ఐపీఓకు రానున్నాయి. రూ.2,144 కోట్ల సమీకరణ లక్ష్యంతో కిమ్స్​, రూ.520 కోట్ల సమీకరించేందుకు దొడ్ల డెయిరీ ఈ నెల 16 నుంచి 18 వరకు ఐపీఓకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సంస్థల నిర్ణయించిన షేర్ బ్యాండ్​ విలువ సహా ఇతర పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

KIMS IPO Updates
కిమ్స్​ ఐపీఓ అప్​డేట్స్
author img

By

Published : Jun 11, 2021, 5:41 PM IST

కరోనా సంక్షోభంలోనూ చాలా సంస్థలు వ్యాపార విస్తరణకు ముందడుగు వేస్తున్నాయి. ఐపీఓలకు వచ్చే కొత్త కంపనీలు పెరగటమే ఇందుకు నిదర్శనం. తెలుగు రాష్ట్రాల నుంచి రానున్న రోజుల్లో మూడు సంస్థలు ఐపీఓకు రానున్నాయి. కిమ్స్​, దొడ్ల డెయిరీ ఇదె నెలలో ఐపీఓకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. విజయ డయాగ్నోస్టిక్స్ కూడా ఐపీఓ సన్నాహకాలు ముమ్మరం చేసింది.

జూన్ 16 నుంచి కిమ్స్​ ఐపీఓ

హైదరాబాద్​ కేంద్రంగా పని చేస్తున్న కిమ్స్ (క్రిష్ణ ఇన్స్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్ సైన్సెస్​ లిమిటెడ్​) నెల 16న ఇనీషియల్ పబ్లిక్​ ఆఫర్​ (ఐపీఓ)కు రానుంది. జూన్ 18న ఐపీఓ ముగియనుంది.

మొత్తం రూ.2,144 కోట్లను సమీకరించే లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది కిమ్స్​. 2,35,60,538 ఈక్విటీ షేర్లను ఇందులో విక్రయించనుంది. షేరు ప్రైస్ ​బ్యాండ్​​ను రూ.815-825గా నిర్ణయించింది కిమ్స్​.

దొడ్ల డైయిరీ ఐపీఓ లక్ష్యం రూ.520 కోట్లు..

హైదరాబాద్‌కు చెందిన పాల ఉత్పత్తుల సంస్థ దొడ్ల డెయిరీ కూడా జూన్ 16-18 మధ్య ఐపీఓకు అందుబాటులో ఉండనుంది. రూ.520 కోట్లు సమీకరించే లక్ష్యంతో 1,09,85,444 షేర్లను ఇష్యూ చేయనుంది. షేరు ప్రైస్​ బ్యాండ్​​ను రూ.421-428 మధ్య నిర్ణయించింది కంపెనీ.

దొడ్ల డెయిరీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక, మహారాష్ట్రలోనూ కార్యకలాపాలు సాగిస్తోంది.

విజయ డయగ్నోస్టిక్స్​ ఐపీఓ ధరఖాస్తు..

హైదరాబాద్​ కేంద్రంగా ఉన్న విజయ డయాగ్నోస్టిక్స్ కూడా ఐపీఓకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రాథమిక ముసాయిదాను సెబీకి ఇటీవల సమర్పించింది.

ఐపీఓ ద్వారా సంస్థ ప్రమోటర్లు.. డాక్టర్ ఎస్​. సురేంద్రనాథ్​ రెడ్డి, కారాకోరమ్​ లిమిటెడ్​ ఇన్వెస్టర్లు, కేధార క్యాపిటల్​ ఆల్టర్నెటివ్స్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​ 35,688,064 ఇక్విటీ షేర్లను.. విక్రయించనున్నట్లు పేర్కొంది విజయ డయాగ్నోస్టిక్స్. ఈ మొత్తం కంపెనీ వాటాలో 35 శాతానికి సమానం.

విజయ డయాగ్నోస్టిక్స్ ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, దిల్లీ ఎన్​సీఆర్​, కోల్​కతా సహా 13 నగరాల్లో సేవలందిస్తోంది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో విజయ డయాగ్నోస్టిక్స్ రూ.84.91 కోట్ల లాభాన్ని గడించింది. ఆదాయం రూ.388.59 కోట్లుగా నమోదైంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.