పిజ్జా హట్, కేఎఫ్సీ ఫుడ్ చైన్ల ఆపరేటర్ దేవ్యాని ఇంటర్నేషనల్.. ఈ నెల 4న ఐపీఓకు రానుంది. సబ్స్క్రిప్షన్ చివరి తేదీ ఆగస్టు 6. ఐపీఓలో ఒక్క షేరు ధరను రూ.86-90గా నిర్ణయించింది. రూ.1,838 కోట్ల సమీకరించే ఉద్దేశంతో దేవ్యాని ఇంటర్నేషనల్ ఐపీఓకు వస్తోంది. ఇందులో రూ.440 కోట్ల విలువైన షేర్లను తాజాగా ఇష్యూ చేస్తుండగా.. 15.53 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనుంది కంపెనీ.
హెల్త్ సెక్టార్కు చెందిన క్రిష్ణా డయాగ్నోస్టిక్స్ కూడా.. ఈ వారమే ఐపీఓకు రానుంది. మొత్తం రూ.1,213 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఈ కంపెనీ ఐపీఓకు వస్తోంది. ఐపీఓకు కంపెనీ షేరు ధర రూ.933-954గా నిర్ణయించింది. షేర్ల సబ్స్క్రిప్షన్ 4న ప్రారంభమై.. 6వ తేదీన ముగియనుంది.
ఐపీఓకు పీబీ ఫిన్టెక్ దరఖాస్తు..
ఆన్లైన్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ పైసాబజార్, క్రెడిట్ కంపారిజన్ పోర్టల్ పైసా బజార్ల మాతృసంస్థ పీబీ ఫిన్టెక్ ఐపీఓకు సిద్దమైంది. రూ.6,017.50 కోట్లను సమీకరించే ఉద్దేశంతో ఐపీఓకు అనుమతి కోరుతూ.. సెబీకి ప్రాథమిక దరఖాస్తు చేసుకుంది.
ఇందులో రూ.3,750 కోట్లు విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా ఇష్యూ చేయనుండగా.. రూ.2,267.50 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనున్నట్లు దరఖాస్తులో పేర్కొంది పీబీ ఫిన్టెక్. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఎస్వీఎఫ్ పైతాన్ 2 (సైమన్) రూ.1,875 కోట్ల షేర్లను, కంపెనీ సహ వ్యవస్థాపకులు యాశిష్ దహియా రూ.250 కోట్ల కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు తెలిపింది.
ఐపీఓకు ముందే ఈక్విటీ ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ.750 కోట్లను సమీకరించే యోచనలో కూడా కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఐపీఓ సేకరించిన నిధులను వ్యూహాత్మక పెట్టుబడులు, చిన్న సంస్థల కొనుగోలు, ఇతర దేశాలకు కార్యకలాపాల విస్తరణ వంటి అవసరాలకు ఉపయోగించుకోనుంది పీబీ ఫిన్టెక్.
నాలుగు నెలల్లో రూ.27 వేల కోట్లు..
దేశంలో ఇటీవల ఐపీఓల సందడి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో మొత్తం 12 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. ఈ కంపెనీలన్నీ రూ.27 వేల కోట్ల నిధులను సమీకరించాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే మరో 40 కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలకు సెబీ అనుమతులు లభించగా.. మరిన్ని సంస్థలకు త్వరలో అనుమతులు వచ్చే అవకాశాలున్నాయి. ఈ కంపెనీలన్ని రూ.70 వేల కోట్లు సేకరించే వీలుంది.
ఇవీ చదవండి: