ETV Bharat / business

డేటా ఛార్జీల పెంపు దిశగా జియో అడుగులు

author img

By

Published : Mar 6, 2020, 8:18 PM IST

సంచలనాల దిగ్గజం రిలయన్స్​ జియో డేటా ఛార్జీల పెంపు దిశగా అడుగులేస్తోంది. ఒక జీబీ డేటా ధర రూ.5 మేర పెంచాలనే ప్రతిపాదనను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్​ ముందు ఉంచింది. దశల వారీగా ధరలు పెంచేందుకు అనుమతివ్వాలని కోరింది.

JIO DATA CHARGES MAY HIKE
పెరగనున్న జియో డేటా ఛార్జీలు

టెలికాం రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చిన రిలయన్స్‌ జియో మరోసారి వైర్‌లెస్‌ డేటా టారిఫ్‌లను పెంచే యోచనలో ఉంది. ప్రస్తుతం ఒక జీబీ డేటాకు ఉన్న రూ.15 ఛార్జీని.. రూ.20కి పెంచేందుకు అనుమతి కోరుతూ ట్రాయ్‌కు లేఖ రాసింది. అయితే వాయిస్‌ కాల్స్‌ ధరలను మాత్రం యథాతథంగా కొనసాగించనున్నట్లు పేర్కొంది.

పెంచిన డేటా ధరలను తక్షణమే కాకుండా ఆరు నుంచి తొమ్మిది నెలల్లో అమలు చేయాలని భావిస్తున్నట్లు లేఖలో తెలిపింది. పెరిగిన డేటా ధరలు అన్ని టారిఫ్‌లకు వర్తిస్తాయని పేర్కొంది.

అంతకుముందు.. టెలికాం రంగంలోని టారిఫ్‌ సమస్యలపై స్పందించాల్సిందిగా టెలికాం ఆపరేటర్లను ట్రాయ్‌ కోరింది. దీనిపై జియో కన్సల్టేషన్‌ పత్రాన్ని సమర్పించింది. సాధారణంగా వినియోగదారులు తక్కువ ఖర్చుతో సేవలు పొందాలనుకుంటారని, అందుకే పెరిగిన టారిఫ్‌లను రెండు మూడు విడతల్లో అమలు చేసేలా వెసులుబాటు కల్పించాలని కోరింది.

ఇదీ చూడండి:పేటీఎం, ఫోన్​పే మధ్య ట్విట్టర్​ వార్​- కారణం అదే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.