ETV Bharat / business

40 కోట్ల సబ్​స్క్రైబర్స్​ మార్క్​ దాటిన తొలిసంస్థగా 'జియో' - జియో వార్తలు

భారత్​లో 40 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకున్న తొలి టెలికాం సంస్థగా అవతరించింది రిలయన్స్​ జియో. టెలికాం నియంత్రణ సంస్థ తాజా నివేదిక ప్రకారం గత జులైలో 35 లక్షలకుపైగా కొత్త కనెక్షన్లు పెరగటం వల్ల ఈ మార్క్​ను అధిగమించింది.

Jio
రిలయన్స్​ జియో
author img

By

Published : Oct 13, 2020, 5:08 AM IST

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్​ జియో సంచలనాలు సృష్టిస్తోంది. అత్యధిక వినియోగదారులతో దేశంలోనే తొలిస్థానంలోఉన్న జియా.. తాజాగా మరో ఘనత సాధించింది. భారత్​లో 40 కోట్ల వినియోగదారులను సొంత చేసుకున్న తొలి టెలికాం సంస్థగా అవతరించింది. టెలికాం నియంత్రణ సంస్థ తాజా నివేదిక ప్రకారం జులైలో 35 లక్షలకుపైగా కొత్త కస్టమర్లు చేరటం వల్ల ఈ మార్క్​ను అందుకుంది జియో.

భారత మొబైల్​ మార్కెట్​లో 35.03 శాతంతో 40,08,03,819 మంది వినియోగదారులతో దూసుకెళుతోంది జియో. భారతీ ఎయిర్​టెల్​కు జులైలో 32.6 లక్షలు, బీఎస్​ఎన్​ఎల్​కు 3.88 లక్షల మంది కొత్త వినియోగదారులు పెరిగారు. మరోవైపు వొడాఫోన్​ ఐడియా.. 37 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది.

మొత్తం టెలికాం సబ్​స్క్రైబర్స్​ జులైలో 116.4 కోట్లకు చేరుకున్నారు. చరవాణి కనెక్షన్స్​ పరంగా దేశంలో వినియోగదారుల సంఖ్య జులైలో 114.4 కోట్లకు చేరింది. అది జులైలో 114 కోట్లుగా ఉంది. అందులో పట్టణాల్లో(61.9) గ్రామీణ ప్రాంతాల్లో 52.1 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు ట్రాయ్​.. నెలవారి సబ్​స్క్రైబర్స్​ నివేదిక వెల్లడించింది.

కొన్ని సంవత్సరాల తర్వాత ఫిక్స్​డ్​-లైన్​ కనెక్షన్లు స్వల్పంగా పెరిగి 1,98,20,419కి చేరాయి. జియో నేతృత్వంలోని ప్రైవేటు టెలికాం సంస్థలు ముందంజలో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్​ఎన్​ఎల్​, ఎంటీఎన్​ఎల్​, రిలయన్స్​ కమ్యూనికేషన్స్​, టాటా టెలీసర్వీసెస్​లలో క్షీణత కనిపిస్తోంది.

బ్రాడ్​బాండ్​ కనెక్షన్లు..

బ్రాడ్​బాండ్​ కనెక్షన్లు జులైలో స్వల్పంగా వృద్ధి నమోదు చేశాయి. జూన్​లో 69.82 కోట్లుగా ఉండగా.. అది జులైలో 1.03 శాతం పెరిగి 70.54 కోట్లకు చేరింది. ఇందులో జియోకు 40.19 కోట్లు, భారతీ ఎయిర్​టెల్​కు 15.57 కోట్లు, వొడాఫోన్​ ఐడియాకు 11.52 కోట్లు, బీఎస్​ఎన్​ఎల్​కు 2.3 కోట్లు బ్రాడ్​బాండ్​ వినియోగదారులు ఉన్నారు.

ఇదీ చూడండి: ప్రత్యర్థుల పోస్ట్​ పెయిడ్​ కస్టమర్లకు జియో వల!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.