ఐయూసీ ఛార్జీల వసూలు ప్రారంభించిన తర్వాత 'ఆల్ ఇన్ వన్' పేరిట జియో కొత్త ప్లాన్లను అమలులోకి తెచ్చింది. ఇప్పటి వరకు ఇవి స్మార్ట్ ఫోన్ వినియోగదార్లకు మాత్రమే వర్తించాయి. తాజాగా జియోఫోన్ యూజర్లకు సరికొత్త ప్యాకేజీలు ప్రకటించింది జియో.
ఈ ప్లాన్లలో అపరిమిత కాలింగ్, డేటాతో పాటు నాన్ జియో నెట్‌వర్క్‌లకు 500 ఐయూసీ నిమిషాలు జతచేశారు. వీటి కాలపరిమితి నెల రోజులు మాత్రమే.
ప్లాన్లు..
- రూ.75 - 3జీబీ డేటా
- రూ.125 - 14జీబీ డేటా
- రూ.155 - 28జీబీ డేటా
- రూ.185 - 56జీబీ డేటా
ఈ అన్ని ప్లాన్లలో 500 ఐయూసీ నిమిషాలు అందిస్తోంది. జియో నుంచి జియోకి అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ప్లాన్స్‌కి నిర్దేశిత మొత్తం చెల్లిస్తే కొత్త ప్లాన్లకి మారొచ్చని జియో ప్రకటించింది. ఇప్పటి వరకు టెలికాం మార్కెట్లో ఉన్న వాటిలో అత్యంత చౌకైన ప్లాన్ జియో అందిస్తున్న రూ.75 ప్లానేనని సంస్థ తెలిపింది.
స్మార్ట్ఫోన్లకు..
ఇటీవల రూ.222, రూ.333, రూ.444తో స్మార్ట్ ఫోన్లకు జియో 'ఆల్ ఇన్ వన్' ప్లాన్‌లు ప్రవేశ పెట్టింది. వీటిలో రోజుకు 2 జీబీల డేటా, అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని కల్పించింది. ఈ ప్యాక్‌లలో వెయ్యి నిమిషాలపాటు ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేసుకునే అవకాశం కల్పించింది.
ఇదీ చూడండి: జియో గుడ్‌న్యూస్: ఉచిత కాల్ బ్యాలెన్స్‌తో కొత్త ప్లాన్లు