ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసిన జెట్ ఎయిర్వేస్ సంస్థకు మరో షాకిచ్చారు ఆ సంస్థ సీఈఓ (ముఖ్య కార్యనిర్వాహణాధికారి) వినయ్ దూబె. బాధ్యతల నుంచి స్వతహాగా తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతోనే దూబె.. సీఈఓ పదవికి రాజీనామా చేశారని, తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని జెట్ ఎయిర్వేస్ తెలిపింది.
నిధుల సేకరణ విషయమై గత నెలలో బ్యాంకర్లు, జెట్ ఎయిర్వేస్ ప్రతినిధుల మధ్య సుదీర్ఘ సమావేశాలు జరిగాయి. జెట్ సేవలు నిలిచిపోకుండా కొనసాగేందుకు రూ. 400 కోట్లు అత్యవసర రుణం కావాలని ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది. అయితే అప్పటి వరకు జెట్ యాజమాన్యాన్ని ఊరించిన రుణ దాతలు, బ్యాంకులు చివరి నిమిషంలో చేతులెత్తేశాయి. ఫలితంగా చేసేదేమీ లేక తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది జెట్ ఎయిర్వేస్.
ఇదీ చూడండి : 115 మేకులు మింగిన 'ఉక్కు మనిషి'