వ్యక్తిగత ప్రమాదం (పర్సనల్ యాక్సిడెంట్) సహా కొన్ని లాభదాయక ఆరోగ్య బీమా పథకాలపై వాయిదా పద్ధతిలో క్లెయిమ్‌ను చెల్లించేందుకు వీలుకల్పించే అంశంపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) కసరత్తు చేస్తోంది.
ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు గతేడాది నియమించిన కమిటీ... అన్ని రకాల పరిశీలనలు చేసిన తర్వాత ఈ ఏడాది జనవరిలో ఐఆర్డీఏఐకు నివేదికను సమర్పించింది.
తాజాగా నూతన మార్గదర్శకాలతో కూడిన ముసాయిదాను తీసుకొచ్చింది ఐఆర్డీఏఐ. భాగస్వాముల నుంచి దీనిపై ఏప్రిల్ 17లోపు తమ అభిప్రాయాలను తెలపాలని కోరింది.
కొత్త ముసాయిదా ఏం చెబుతోంది...
- బీమా లబ్ధిదారు క్లెయిమ్‌ను ఏక మొత్తంలో గానీ వాయిదా పద్దతిలో గానీ పొందవచ్చు. ఇది మాత్రమే కాకుండా క్లెయిమ్‌లో సగం ఏకమొత్తంలో మిగతా సగం వాయిదా పద్ధతిలో తీసుకునే వీలు కలగనుంది.
- ఈ తరహా బీమా క్లెయిమ్‌ను చెల్లించేందుకు గరిష్ఠంగా ఐదేళ్ల పరిమితి విధించింది.
- ఈ రెండు రకాల బీమాలకు ఒకే విధమైన ప్రీమియం ధరలు ఉండనున్నాయి.
- ఏక మొత్తంలో పొందే క్లెయిమ్‌తో పోలిస్తే... వాయిదా పద్ధతిలో పొందే మొత్తాలు ఎక్కువగా ఉంటాయి.