ETV Bharat / business

'ఐఓసీ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు'

రాబోయే 4-5 ఏళ్లలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) రూ. లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అంతేకాక హరిత ఇంధనంపైనా దృష్టి పెట్టనున్నట్లు ఐఓసీ ఛైర్మన్‌ శ్రీకాంత్‌ మాధవ్‌ వైద్య తెలిపారు.

IOC
ఐఓసీ
author img

By

Published : Aug 28, 2021, 5:21 AM IST

భారత చమురు దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) రాబోయే 4-5 ఏళ్లలో తన చమురు శుద్ధి(రిఫైనింగ్‌) సామర్థ్యాన్ని మూడింట ఒక వంతు మేర పెంచుకోవడం కోసం రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. సమీప భవిష్యత్‌లో ఇంధన గిరాకీ పెరుగుతుందని ఈ కంపెనీ అంచనా వేస్తోంది. శుక్రవారం జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో ఐఓసీ ఛైర్మన్‌ శ్రీకాంత్‌ మాధవ్‌ వైద్య మాట్లాడుతూ 'ఇప్పటికే పెట్రోలు గిరాకీ కరోనాకు ముందు స్థాయికి చేరింది. దీపావళి కల్లా డీజిల్‌ గిరాకీ కూడా ఆ స్థాయికి చేరుతుందని అంచనా. వివిధ అంచనాల ప్రకారం.. 2040 కల్లా భారత ఇంధన గిరాకీ ప్రస్తుతమున్న 250 మిలియన్‌ టన్నుల నుంచి 400-450 మి.టన్నులకు చేరొచ్చ'ని పేర్కొన్నారు.

106.7 మి. టన్నులకు సామర్థ్యం!:

ఈ గిరాకీని అందిపుచ్చుకోవడం కోసం ఐఓసీ వేగంగా కొత్త ప్రాజెక్టులను చేపడుతోంది. సంస్థకు ఉన్న 11 రిఫైనరీల సామర్థ్యం మొత్తం 81.2 మిలియన్‌ టన్నులు కాగా, దీన్ని 4-5 ఏళ్లలో 106.7 మి. టన్నులకు పెంచాలనేది ప్రణాళికగా వైద్య వివరించారు. గుజరాత్‌లోని కొయాలి రిఫైనరీ సామర్థ్యాన్ని ప్రస్తుత 13.7 మి. టన్నుల నుంచి 18 మి. టన్నులకు; హరియాణలోని పానిపట్‌ రిఫైనరీ సామర్థ్యాన్ని 15 మి. టన్నుల నుంచి 25 మిలియన్‌ టన్నులకు పెంచనున్నట్లు వివరించారు. గువహటి, బరౌని రిఫైనరీలకూ విస్తరణ ప్రణాళికలను రచించినట్లు పేర్కొన్నారు. అనుబంధ సంస్థ అయిన చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌లో కొత్త ప్లాంటు నిర్మించబోతున్నట్లు వెల్లడించారు.

'దేశంలోనే తొలి గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంటు నిర్మిస్తాం':

చమురుశుద్ధి విస్తరణలతో పాటు సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, హైడ్రోజన్‌ ఆధారిత సీఎన్‌జీ, బయోఇంధనం, హైడ్రోజన్‌, ఇ-మొబిలిటీ సొల్యూషన్లపైనా దృష్టి సారించినట్లు వివరించారు. విద్యుత్‌ వాహనాల కోసం అల్యూమినియం ఎయిర్‌ బ్యాటరీలను భారత్‌లో తయారు చేయడం కోసం ఇజ్రాయిల్‌ కంపెనీ 'ఫినర్జీ'తో జట్టుకట్టినట్లూ తెలిపారు. దీనిపై వాహన కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని, క్షేత్రస్థాయి పరీక్షలు త్వరలో ప్రారంభిస్తామన్నారు.

దేశంలోనే తొలి 'గ్రీన్‌ హైడ్రోజన్‌' ప్లాంటును మధుర రిఫైనరీలో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Stock Market: సెన్సెక్స్​ కొత్త రికార్డ్- తొలిసారి 56వేల పైన...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.