స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు నేడు అడ్డుకట్టపడింది. ఇన్ఫోసిస్ సీఈఓ, సీఎఫ్లపై అవినీతి ఆరోపణల కారణంగా ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి సూచీలు. ఆర్థిక రంగ షేర్లు కాస్త సానుకూలంగా ఉన్నా... ఐటీ, వాహన షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 334 పాయింట్లు కోల్పోయింది. చివరకు 38,964 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 72 పాయింట్లు క్షీణించి..11,590 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 39,426 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 38,925 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,714 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,574 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఐసీఐసీఐ బ్యాంకు 3.06 శాతం, సన్‌ఫార్మా 1.10 శాతం, బజాజ్ ఆటో 1.04 శాతం, హిందుస్థాన్ యునీలీవర్ 1.02 శాతం, హెచ్డీఎఫ్సీ 0.98 శాతం, పవర్ గ్రిడ్ 0.96 శాతం లాభాలను ఆర్జించాయి.
ఇన్ఫోసిస్ ఏకంగా 16.21 శాతం నష్టపోయింది. ఇటీవలి కాలంలో ఇంత భారీ స్థాయిలో నష్టాలు రావడం ఇదే ప్రథమం.
టాటా మోటార్స్ 3.51 శాతం, భారతీ ఎయిర్టెల్ 3.24 శాతం, హెచ్‌సీఎల్‌టెక్ 2.87 శాతం, బజాజ్ ఫినాన్స్ 2.56 శాతం, టెక్ మహీంద్రా 2.31 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి: సమ్మె: పాక్షికంగా నిలిచిన బ్యాంకింగ్ సేవలు