ETV Bharat / business

Infosys M-Cap: 100 బిలియన్​ డాలర్ల క్లబ్​లోకి ఇన్ఫోసిస్​ - ఇన్ఫోసిస్ లేటెస్ట్​ అప్​డేట్​

టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys New record) 100 బిలియన్​ డాలర్ల క్లబ్​లో చేరింది. కంపెనీ మార్కెట్ విలువ (Infosys M-cap) ​మంగళవారం తొలిసారి ఈ మార్క్​ను తాకింది. ఈ స్థాయికి చేరుకున్న నాలుగో భారతీయ కంపెనీగా నిలిచింది.

Infosys new record
ఇన్ఫోసిస్​ కొత్త రికార్డు
author img

By

Published : Aug 24, 2021, 2:23 PM IST

దేశీయ టెక్​ దిగ్గజం ఇన్ఫోసిస్​ మరో రికార్డును (Infosys new record) సాధించింది. దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం ఉదయం కంపెనీ షేర్లు జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. దీనితో కంపెనీ మార్కెట్ క్యాపిటల్​ (ఎం-క్యాప్​) (Infosys M-Cap) 100 బిలియన్ డాలర్ల మార్క్​ దాటింది. ఈ మార్క్​ను దాటిన నాలుగో భారతీయ కంపెనీగా నిలిచింది.

బీఎస్​ఈ వద్ద లభించిన డేటా ప్రకారం మంగళవారం ఉందయం సంస్థ షేరు విలువ రూ.1,752.45 వద్దకు చేరింది. ఎం-క్యాప్​ రూ.7.44 లక్షల కోట్ల మార్క్​ను తాకింది.

తొలి మూడు కంపెనీలు..

  • మార్కెట్ విలువ పరంగా 100 బిలియన్ డాలర్ల మార్క్​ దాటిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్​ చరిత్ర సృష్టించింది. ఈ కంపెనీ ఎం-క్యాప్ (RIL M-Cap)​ 140 బిలియన్ డాలర్లుగా ఉంది.
  • టాటా గ్రూప్​నకు చెందిన టెక్​ దిగ్గజం టీసీఎస్​ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. టీసీఎస్​ ప్రస్తుత ఎం-క్యాప్ (TCS M-Cap)​ 115 బిలియన్​ డాలర్లు.
  • ఇక మూడో స్థానంలో ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ఉంది. దీని ఎం-క్యాప్ (HDFC Bank M-Cap) 100.1 బిలియన్​ డాలర్లు.

ఇదీ చదవండి: ఇన్ఫోసిస్​కు నిర్మలా సీతారామన్​ డెడ్​లైన్​.. కారణమిదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.