ప్రముఖ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, యాక్సెంచర్లు ఉద్యోగుల పట్ల తమ నిబద్ధతను చాటుకున్నాయి. తమ సిబ్బందికి కరోనా టీకా కోసమయ్యే ఖర్చును భరిస్తామని ప్రకటించాయి.
'మా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా టీకా కోసమయ్యే ఖర్చును భరిస్తాం.' అని ఇన్ఫోసిస్ పేర్కొంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఉద్యోగులకు టీకా వేసేందుకు హెల్త్‌కేర్ విభాగాలతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు తెలిపింది.
అమెరికా కేంద్రంగా పని చేస్తున్న మరో టెక్ దిగ్గజం యాక్సెంచర్ భారతీయ విభాగం కూడా తమ ఉద్యోగులకు, వారిపై ఆధారపడిన వారికి వ్యాక్సినేషన్ కోసమయ్యే ఖర్చులు భరించనున్నట్లు తెలిపింది.
భారతీయ అతిపెద్ద టెక్ దిగ్గజం టీసీఎస్ కొవిడ్-19 పరీక్ష, వ్యాక్సినేషన్ నిర్వహణ సూట్‌ను ఆవిష్కరించింది. ఇది టెస్టింగ్ నుంచి వ్యాక్సినేషన్ వరకు ఉన్న దశలను క్రమబద్దీకరించేందుకు ఉపయోగపడుతుందని వివరించింది. దీనితో వేగంగా పరీక్షలు, వ్యాక్సినేషన్‌కు వీలవుతుందని టీసీఎస్ పేర్కొంది.
ఇదీ చదవండి:జీఎస్టీ విధిస్తే రూ.75కే లీటర్ పెట్రోల్!