బడ్జెట్ విమానయాన సంస్థ 'ఇండిగో' మరో భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. "ది బిగ్ ఫ్యాట్ ఇండిగో సేల్ పేరుతో" అత్యంత తక్కువ ధరకు దేశీయ, అంతర్జాతీయ విమానయానానికి టికెట్లు విక్రయిస్తోంది.
ఈ ఆఫర్లో దేశీయ విమానయాన ఛార్జీలు రూ.899, అంతర్జాతీయ విమాన ఛార్జీలు రూ.2,999 నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించింది ఇండిగో. డిసెంబర్ 23 నుంచి 26 వరకు ఈ ఆఫర్ ఆందుబాటులో ఉండనుంది. 2020 జనవరి 15 నుంచి 2020 ఏప్రిల్ 15 మధ్య ప్రయాణం చేయాలనుకునేవారికి మాత్రమే 'ది బిగ్ ఫ్యాట్ ఇండిగో సేల్' ఆఫర్ వర్తించనుంది. అన్ని ఛానెళ్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఇండిగో తెలిపింది.
అయితే ఇండిగో అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి కన్వినెన్స్ రుసుములూ ఉండవని పేర్కొంది.
ఇతర ఆఫర్లు ఇలా..
- బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ద్వారా.. చెల్లింపులు జరిపే వారికి.. అదనంగా 15 శాతం(రూ.2,000 వరకు) క్యాష్‌బ్యాక్ లభించనుంది.
- ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డు ద్వారా టికెట్ కొనుగోలు చేసేవారు 15 శాతం (రూ.1,500 వరకు) క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
- ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేసే వారికి ఫ్లాట్ రూ.2,000 క్యాష్‌బ్యాక్ లభించనుంది.
-
Sale alert! Grab the most affordable fares starting at ₹899 at zero convenience fee along with additional cashback up to ₹2,000. Book now https://t.co/I0axoBNADQ #LetsIndiGo pic.twitter.com/hrkyO67eAg
— IndiGo (@IndiGo6E) December 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sale alert! Grab the most affordable fares starting at ₹899 at zero convenience fee along with additional cashback up to ₹2,000. Book now https://t.co/I0axoBNADQ #LetsIndiGo pic.twitter.com/hrkyO67eAg
— IndiGo (@IndiGo6E) December 23, 2019Sale alert! Grab the most affordable fares starting at ₹899 at zero convenience fee along with additional cashback up to ₹2,000. Book now https://t.co/I0axoBNADQ #LetsIndiGo pic.twitter.com/hrkyO67eAg
— IndiGo (@IndiGo6E) December 23, 2019
-
ఇదీ చూడండి:2020లో కొత్త ఉద్యోగాలు కష్టమే..!