ETV Bharat / business

కరోనా వైరస్‌కు విరుగుడు- యాంటీసీరా అభివృద్ధి - కరోనా వైరస్​కు విరుగుడు

కరోనా చికిత్సలో భాగంగా 'యాంటీసీరా'ను అభివృద్ధి చేసింది ఐసీఎంఆర్‌, బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌. ప్రొఫలాక్సిస్‌, కొవిడ్‌-19 లక్షణాలకు దీంతో చికిత్స చేయవచ్చని ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

anticera for corona treatment
కరోనా వైరస్‌కు విరుగుడు- యాంటీసీరా అభివృద్ధి
author img

By

Published : Oct 2, 2020, 7:20 AM IST

కరోనా వైరస్‌ వ్యాధి (కొవిడ్‌-19) నివారణ, చికిత్సలో భాగంగా ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌), హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌తో కలిసి అత్యంత అధికంగా శుద్ధి చేసిన 'యాంటీసీరా'ను అభివృద్ధి చేసింది. ప్రొఫలాక్సిస్‌, కొవిడ్‌-19 లక్షణాలకు దీంతో చికిత్స చేయవచ్చని ఈ సందర్భంగా ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

రేబిస్‌, హెపటైటిస్‌-బి, వాక్సినా వైరస్‌, టెటనస్‌, బొటులిసమ్‌, డిఫ్తీరియా... తదితర ఎన్నో రకాలైన వైరల్‌, బాక్టీరియా వ్యాధులకు గతంలో ఇదే పద్ధతిలో చికిత్స చేసినట్లు పేర్కొంది.

"కొవిడ్‌-19 బాధితుల నుంచి ప్లాస్మా సేకరించి దాంతో రోగులకు చికిత్స చేయవచ్చు. కానీ యాంటీబాడీల తీరుతెన్నులు, వాటి సమర్థత, సాంద్రత ఒక రోగి నుంచి తీసిన ప్లాస్మాకు మరొక రోగి నుంచి తీసిన ప్లాస్మాకు మారుతూ ఉంటాయి. అందువల్ల ప్లాస్మా మీదే పూర్తిగా ఆధారపడి కొవిడ్‌- 19 జబ్బును ఎదుర్కొనలేం"

- ఐసీఎంఆర్‌

దీనికి ప్రత్యామ్నాయంగా 'యాంటీసీరా' స్ధిరమైన ఫలితాలను సాధించగలదని స్పష్టం చేసింది. అంతేగాక మరొక చికిత్సా మార్గంగా కూడా ఉంటుందని తెలియజేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.