ETV Bharat / business

'హైవే ప్రాజెక్టుల్లోనూ చైనా సంస్థలకు నో ఎంట్రీ' - భారత్​ చైనా సరిహద్దు వివావదం

రోడ్డు నిర్మాణ కార్యకలాపాల్లో చైనా సంస్థలను నిషేధిస్తున్నట్టు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ తెలిపారు. ఎమ్​ఎస్​ఎమ్​ఈల్లోనూ చైనా సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించమని స్పష్టం చేశారు.

India to ban Chinese cos from highway projects, says Gadkari
'హైవే ప్రాజెక్టుల్లోనూ చైనా సంస్థలకు నో ఎంట్రీ'
author img

By

Published : Jul 1, 2020, 5:19 PM IST

Updated : Jul 1, 2020, 7:50 PM IST

రహదారుల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను అనుమతించబోమని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ ప్రకటించారు. జాయింట్​ వెంచర్లకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. వీటితో పాటు ఎమ్​ఎస్​ఎమ్​ఈల్లోనూ చైనా సంస్థల పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహించదని పేర్కొన్నారు.

చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న తరుణంలో గడ్కరీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది..

"రోడ్డు నిర్మాణాలకు సంబంధించి చైనా భాగస్వామిగా ఉండే జాయింట్​ వెంచర్లకు అనుమతినివ్వము. ఈ విషయంపై మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం. చైనా సంస్థల నిషేధానికి సంబంధించి త్వరలోనే విధివిధానాలను ప్రకటిస్తాం. దీనితో పాటు రహదారుల నిర్మాణంలో భారతీయ సంస్థలు భాగస్వాములుగా ఉండేందుకు కొన్ని నిబంధనలను సడలిస్తాం. సాంకేతిక, ఆర్థిక నిబంధనల్లో మార్పులు చేసేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని.. ఇప్పటికే హైవే కార్యదర్శి గిరిధర్​ అరామనే, ఎన్​హెచ్​ఏఐ ఛైర్మన్​ ఎస్​ ఎస్​ సంధుకు ఆదేశాలిచ్చాను. నియమాల మార్పుతో భారత సంస్థలను ప్రోత్సహించినట్టు అవుతుంది."

--- నితిన్​ గడ్కరీ, కేంద్ర రవాణాశాఖ మంత్రి.

అయితే తాజా నిర్ణయం... ప్రస్తుత, భవిష్యత్తు ప్రాజెక్టులకు వర్తిస్తుందని.. ఇప్పటికే మొదలైన వాటికి కాదని గడ్కరీ స్పష్టం చేశారు.

గత నెల 15న చైనీయులు భారత సైనికులపై దాడికి తెగబడ్డారు. 20మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. అనంతరం చైనా తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 59 చైనా యాప్స్​ను సోమవారం నిషేధించింది ప్రభుత్వం. ఇప్పుడు రహదారులు, ఎమ్​ఎస్​ఎమ్​ఈల్లో చైనా భాగస్వామ్యాన్ని తగ్గించనుంది.

Last Updated : Jul 1, 2020, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.