టెలికాం రంగంలో దిగ్గజ కంపెనీలు టారిఫ్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా సంస్థల పెంపు ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రాగా, డిసెంబర్ 6 నుంచి రిలయన్స్ జియో ఛార్జీలను పెంచనుంది. ఈ నేపథ్యంలో మొబైల్ ఇంటర్నెట్ ఛార్జీలపై స్పందించారు కేంద్ర టెలికాం, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్.
-
India’s Mobile Internet rate per GB remains by far the lowest in the world. UK based https://t.co/8ZGRuuOuWF which compared mobile data plans around the world has indicated this. pic.twitter.com/LykgjvlUd8
— Ravi Shankar Prasad (@rsprasad) December 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">India’s Mobile Internet rate per GB remains by far the lowest in the world. UK based https://t.co/8ZGRuuOuWF which compared mobile data plans around the world has indicated this. pic.twitter.com/LykgjvlUd8
— Ravi Shankar Prasad (@rsprasad) December 2, 2019India’s Mobile Internet rate per GB remains by far the lowest in the world. UK based https://t.co/8ZGRuuOuWF which compared mobile data plans around the world has indicated this. pic.twitter.com/LykgjvlUd8
— Ravi Shankar Prasad (@rsprasad) December 2, 2019
"మొబైల్ ఇంటర్నెట్ 1జీబీ ధర ఇతర దేశాలతో పోలిస్తే భారత్లోనే అతితక్కువ. బ్రిటన్కు చెందిన కేబుల్. కో. యూకే అనే సంస్థ చేసిన పరిశీలనలో ఈ విషయం బయటపడింది. యూపీఏ ప్రభుత్వంలో అధికంగా ఉన్న డేటా ధరలు నరేంద్రమోదీ పాలనలో నేలకు దిగివచ్చాయి. 2014లో 1జీబీ ధర రూ. 268.97 గా ఉండగా ప్రస్తుతం అది రూ. 11.78కి చేరింది."
-రవిశంకర్ ప్రసాద్ ట్వీట్
భారత్లో 1జీబీ డేటా ధర 0.26 డాలర్లు కాగా, యూకేలో 6.66 డాలర్లని, అదే సమయంలో అమెరికాలో ఈ మొత్తం 12.37 గా పేర్కొందీ బ్రిటన్ సంస్థ నివేదిక. అయితే ప్రపంచవ్యాప్తంగా 1జీబీ డేటా సగటు ధర 8.53 డాలర్లుగా వెల్లడించింది. 230 దేశాల డేటా ధరలను పరిశీలించి నివేదిక తయారు చేసినట్లు సంస్థ స్పష్టం చేసింది.
భారతీ ఎయిర్టెల్ నేటి నుంచి 41 శాతం పెంపుతో డేటాను అందించనుండగా, రిలయన్స్ జియో డిసెంబర్ 6నుంచి 40 శాతం పెంచాలని నిర్ణయించింది. వొడాఫోన్-ఐడియా నెట్వర్క్లు కూడా నేటి నుంచే పెంచిన ధరలను వర్తింపజేయనున్నాయి. వీటి పెంపు శాతం 15-47 మధ్య ఉండనుంది.
రిలయన్స్ జియో 40 శాతం టారిఫ్ సుంకాలు పెంచడం ద్వారా 300 శాతం లాభపడేందుకు యోచన చేస్తోంది. ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా పెరిగిన ధరల్లో టారిఫ్లను వసూలు చేస్తున్నాయి.
ఎయిర్టెల్, వొడౌఫోన్-ఐడియా టారిఫ్ ధరల్లో రూ. 35 ధర ఉన్న వాయిస్ రీఛార్జికి రూ. 65 వసూలు చేస్తున్నారు. రూ. 40టారిఫ్ ప్లాన్ను రూ.79 వరకు అందిస్తున్నారు.
ఇదీ చూడండి: ఝార్ఖండ్లో నేడు మోదీ ఎన్నికల ప్రచారం!