ETV Bharat / business

విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడులు తగ్గాయ్​! - ఫిబ్రవరిలో భారతీయ కంపెనీల పెట్టుబడులు

ఈ ఏడాది ఫిబ్రవరిలో భారతీయ కంపెనీల అంతర్జాతీయ ప్రత్యక్ష పెట్టుబడులు 1.85 బిలియన్​ డాలర్లుగా నమోదైనట్లు ఆర్​బీఐ వెల్లడించింది. 2020లో ఇదే సమయంతో పోలిస్తే.. ఈ మొత్తం 31 శాతం తక్కువని పేర్కొంది.

Indian companies investment decline
తగ్గిన భారత కంపెనీల పెట్టుబడులు
author img

By

Published : Mar 7, 2021, 8:53 PM IST

భారతీయ కార్పొరేట్ కంపెనీల అంతర్జాతీయ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ ఏడాది ఫిబ్రవరిలో 31 శాతం తగ్గినట్లు రిజర్వు బ్యాంక్ డేటాలో వెల్లడైంది. 2021 ఫిబ్రవరిలో భారతీ కార్పొరేట్లు అంతర్జాతీయంగా తమ అనుబంధ కంపెనీల్లో, జాయింట్ వెంచర్లలో 1.85 బిలియన్​ డాలర్లు పెట్టుబడి పెట్టగా.. 2020 ఫిబ్రవరిలో ఈ మొత్తం 2.66 బిలియన్​ డాలర్లుగా ఉన్నట్లు ఆర్​బీఐ వెల్లడించింది.

ఇందులో 1.36 బిలియన్ డాలర్లు రుణ రూపేణా, 297.37 మిలియన్​ డాలర్లు ఈక్విటీ పెట్టుబడులుగా, మిగతా 183.82 మిలియన్​ డాలర్లు గ్యారంటీల జారీ ద్వారా పెట్టుబడిగా పెట్టినట్లు ఆర్​బీఐ డేటా పేర్కొంది.

టాటా స్టీల్​ అత్యధికంగా సింగపూర్​లోని దాని అనుబంధ సంస్థలో 1 బిలియన్​ డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. తర్వాతి స్థానంలో సన్​ ఫార్మా అమెరికాలోని దాని సంయుక్త విభాగంలో 100 మిలియన్​ డాలర్లు పెట్టుబడిగా పెట్టినట్లు ఆర్​బీఐ వివరించింది.

ఇదీ చదవండి:ఎఫ్​డీఐల వెల్లువ- 9 నెలల్లో 40% వృద్ధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.