భారత్‌లో మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. యూట్యూబర్లుగా ఆన్‌లైన్‌లోనూ పురుషులు గట్టిపోటీ ఇస్తున్నారు. యూట్యూబ్ మాతృ సంస్థ గూగుల్ వెల్లడించిన తాజా గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.
10 లక్షల మంది సబ్స్క్రైబర్లకు పైగా చందాదారులున్న మహిళా యూట్యూబర్ల సంఖ్య గత మూడేళ్లలో 120కి పెరిగినట్లు గూగుల్ తెలిపింది. భారత్‌లో మొత్తం 1,200 యూట్యూబ్ ఛానెళ్లకు 10 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నట్లు పేర్కొంది.
"10 లక్షల మంది సబ్స్క్రైబర్ల జాబితాలో 2015లో కనీసం ఒక్కరు కూడా మహిళా యూట్యూబర్ లేరు. 2016లో తొలి సారి ఒక మహిళా యూట్యూబర్ 10 లక్షల సబ్స్క్రైబర్లను దక్కించుకున్నారు. ఆ తర్వాత వారి సంఖ్య 2017 లో ముగ్గురు.. 2019 నాటికి ఏకంగా 120కి చేరింది." - సత్య రాఘవన్, యూట్యూబ్ కంటెంట్ భాగస్వామ్య డైరెక్టర్, యూట్యూబ్ ఇండియా
10 లక్షల మంది సబ్‌స్క్రైబర్ మార్క్‌ను అందుకున్న యూట్యూబర్లంతా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కంటెంట్ అందిస్తున్నట్లు రాఘవన్ పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో ఉంటున్నట్లు తెలిపారు.
నెలవారీ ప్రాతిపాదికన దేశవ్యాప్తంగా 265 మిలియన్ల మంది యూట్యూబ్‌ను క్రియాశీలంగా వినియోగిస్తున్నట్లు రాఘవన్ తెలిపారు.
ఇదీ చూడండి: పండుగ సీజన్లో సరికొత్త మొబైల్ ఫోన్లు