ETV Bharat / business

క్యూ4లో ఐసీఐసీఐ జోరు- లాభం మూడింతలు

author img

By

Published : Apr 24, 2021, 8:35 PM IST

జనవరి-మార్చి త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంకు అత్యుత్తమ పనితీరు కనబర్చింది. నికర లాభం ఏకంగా మూడింతలైంది. ఆదాయం పెరిగింది. నిరర్ధక ఆస్తులు తగ్గుముఖం పట్టాయి.

ICICI Bank profit jumps 3-folds to Rs 4,403cr in Jan-Mar
క్యూ4లో ఐసీఐసీఐ జోరు- లాభం మూడింతలు

దిగ్గజ ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ లాభం గణనీయంగా పెరిగింది. జనవరి-మార్చి(2020-21 క్యూ4) త్రైమాసికంలో ఏకంగా మూడు రెట్లు అధికంగా నికర లాభాన్ని గడించింది. గతేడాది ఇదే సమయంలో రూ.1,221 కోట్ల లాభం రాగా.. ఈ సారి రూ.4,403 కోట్లు ఆర్జించింది.

స్టాండ్​ఎలోన్ ప్రాతిపదికన బ్యాంకు మొత్తం రాబడి రూ.23,953 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంకు నికర లాభం రూ.4,886 కోట్లు అని ఐసీఐసీఐ వెల్లడించింది. కన్సాలిడేటెడ్ విధానం ప్రకారం బ్యాంకు ఆదాయం రూ.43,621 కోట్లుగా నమోదైందని తెలిపింది.

2021 మార్చి చివరి నాటికి స్థూల నిరర్ధక ఆస్తులు 4.96 శాతానికి పడిపోయాయని తెలిపింది. అంతకుముందు ఏడాది ఇదే సమయానికి స్థూల నిరర్ధక ఆస్తులు 5.53 శాతంగా ఉండేవని వెల్లడించింది. నికర ఎన్​పీఏలు సైతం 1.41 శాతం నుంచి 1.14 శాతానికి పరిమితమయ్యాయని వివరించింది.

ఇదీ చదవండి- వివాద్ సే విశ్వాస్- చెల్లింపుల గడువు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.