ETV Bharat / business

తొలిసారిగా ఐఎంటీ టెక్నాలజీతో హ్యుందాయ్​ - Hyundai SUV latest model

భారత మార్కెట్​లోకి కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టింది దిగ్గజ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్​. ఇంటెలిజెంట్​ మాన్యువల్​ ట్రాన్స్​మిషన్​(ఐఎంటీ) టెక్నాలజీ వాహనాలు విడుదల చేసింది. దేశంలో తొలిసారిగా ఐఎంటీ సాంకేతికతను వినియోగించిన సంస్థగా అవతరించింది.

Hyundai Venue becomes first model to get iMT technology in India
తొలిసారిగా ఐఎంటీ టెక్నాలజీతో హ్యుందాయ్​
author img

By

Published : Jul 4, 2020, 5:42 AM IST

ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యూందాయ్​ కొత్త సాంకేతికతను భారత మార్కెట్​లోకి ప్రవేశపెట్టింది. తొలిసారిగా ఇంటెలిజెంట్​ మాన్యువల్​ ట్రాన్స్​మిషన్​(ఐఎంటీ) సాంకేతికత కలిగిన వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఎస్‌యూవీ మోడల్​లో మొదటిసారి ఈ అధునాతన సాంకేతికతను వినియోగించినట్లు పేర్కొంది.

దేశంలోనే ఐఎంటీ సాంకేతికతను ప్రవేశపెట్టిన తొలి ఆటోమొబైల్​ సంస్థగా హ్యుందాయ్ అవతరించింది. వినియోగదారులకు అనుకూలంగా సులభంగా డ్రైవ్​ చేసేలా క్లచ్​ పెడల్​ లేని సాంకేతికతను తీసుకొచ్చింది. సంప్రదాయ మాన్యువల్​​ ట్రాన్స్‌మిషన్‌ మాదిరిగా డ్రైవర్లు క్లచ్​ పెడల్‌ను నిరంతరం ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఐఎంటీ టెక్నాలజీ పని చేస్తుందని సంస్థ తెలిపింది.

"భవిష్యత్తు​ వ్యాపార వ్యూహాలతో మానవ కేంద్రీకృత సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగదారులకు డ్రైవింగ్​లో ఉండే ఇబ్బందులను తొలగించడానికి మేము నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాం. అటువంటి ప్రయత్నాల్లో ఐఎంటీ ఒకటి."

- ఎస్ఎస్ కిమ్​, హ్యుందాయ్​ మోటార్​ ఇండియా లిమిటెడ్ సీఈఓ

ఈ సాంకేతికతతో డ్రైవర్​ మాన్యువల్​గా గేర్లు మార్చవచ్చని... ఇది వాహనం వేగాన్ని నియంత్రించేందుకు కూడా పని చేస్తుందని హ్యుందాయ్ తెలిపింది.

ఇదీ చూడండి: జూమ్​కు సవాల్​- 'జియో మీట్' యాప్ రిలీజ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.