దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజం హ్యూందాయ్ దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఐ20ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ప్రారంభ ధర రూ.6.80లక్షలుగా పేర్కొంది. టాప్ మోడల్ ధర రూ.11.18లక్షలు. గత మోడల్‌తో పోలిస్తే ఇది మరింత పెద్దదిగా కనిపిస్తుంది. దీని వీల్‌బేస్‌ను కూడా పెంచారు. ఈ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు మాగ్న, స్పోర్ట్స్, ఆస్టా, ఆస్టా ఆప్షనల్ రకాల్లో అందుబాటులో ఉంటుంది.
గత మోడల్‌తో పోలిస్తే ఈ కారు చూడటానికి కొంత భారీ స్పోర్ట్స్ లుక్స్‌తో కనిపిస్తోంది. హుడ్, కాస్కేడింగ్ గ్రిల్, హెడ్‌లైట్ క్లస్టర్లు పూర్తిగా కొత్తవి. వెనకవైపు కూడా డిజైన్‌ను పూర్తిగా మార్చింది. క్యాబిన్‌లో సమూల మార్పులు జరిగాయి. జెడ్ ఆకారంలోని ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. 16 అంగుళాల అలాయ్ వీల్స్‌తో ఈ కారు అందుబాటులో ఉంటుంది.
ఇక క్యాబిన్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటెయిన్‌మెంట్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్, బ్లూలింక్ కనెక్టెడ్ ఫీచర్ వంటివి ఉన్నాయి. ఈ కారులో మూడు ఇంజిన్లను ఆప్షన్‌గా ఇచ్చారు. ఈ కారు 1.0లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.2లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అమర్చారు.