ETV Bharat / business

ఫెయిర్ అండ్​ లవ్​లీలో ఇక 'ఫెయిర్​' మాయం!

'ఫెయిర్​ అండ్​ లవ్​లీ'​ ఫేస్​ క్రీమ్​ పేరులో మార్పులు చేస్తున్నట్లు ఉత్పత్తిదారు హెచ్​యూఎల్ ప్రకటించింది. ఈ పేరు నుంచి 'ఫెయిర్ ' అన్న పదాన్ని తొలగించనున్నట్లు వెల్లడించింది.

hul drops fair word from fair and lovely
ఫెయిర్ అండ్​ లవ్​లీలో ఫెయిర్ ఉండదు
author img

By

Published : Jun 25, 2020, 4:59 PM IST

ప్రపంచవ్యాప్తంగా చర్మ సౌందర్య సాధనాల్లో మొదటగా వినిపించే పేరు... ఫెయిర్ అండ్ లవ్​లీ. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా దీనిని చాలా మంది వినియోగిస్తుంటారు.

అయితే ఫెయిర్​ అండ్​ లవ్​లీపై.. దాని తయారీ సంస్థ హిందుస్థాన్​ యూనీలీవర్(హెచ్​యూఎల్​) కీలక నిర్ణయం తీసుకుంది. 'ఫెయిర్​ అండ్​​ లవ్​లీ' అన్న పేరు నుంచి 'ఫెయిర్​' పదాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

అందం అంటే 'ఫెయిర్​' మాత్రమే కాదు అని తెలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఉత్పత్తి రీ బ్రాండింగ్​కు నియంత్రణపరమైన అనుమతులు లభించాల్సి ఉందని పేర్కొంది.

అసలు కారణమిదేనా?

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసిన జార్జ్​ ఫ్లాయిడ్​ ఘటనతో తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్లుగా చూపిస్తున్నారని.. ఫెయిర్​ అండ్​ లవ్​లీపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే హెచ్​యూఎల్​ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:ఫెయిర్ అండ్​ లవ్​లీలో ఇక 'ఫెయిర్​' ఉండదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.