ETV Bharat / business

మన 'మొబైల్‌'... మోగుతోంది - FDI NEWS

దేశీయ టెలికాం సంస్థల్లో పెట్టుబడికి టెక్​ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. టెలికాం దిగ్గజం రిలయన్స్​ జియోలో ఇప్పటికే 1000 కోట్ల డాలర్లు పెట్టుబడులు వచ్చాయి. వొడాఫోన్‌ ఐడియాలో వాటాపై గూగుల్‌ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

telecom companies
మన మొబైల్‌..మోగుతోంది
author img

By

Published : May 29, 2020, 6:51 AM IST

భారత టెలికాం రంగంపై విదేశీ పెట్టుబడి, టెక్‌ సంస్థలకు ఆసక్తి పెరిగింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ జియో ప్లాట్‌ఫామ్స్‌లో గత నెల రోజుల వ్యవధిలోనే 1000 కోట్ల డాలర్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. మరిన్ని రాబోతున్నాయనీ తెలుస్తోంది. మరో టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియాలో వాటా కొనుగోలుకు గూగుల్‌ ముందుకు వస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

5%వాటా- వొడాఫోన్‌ ఐడియాలో గూగుల్‌

వొడాఫోన్‌ ఐడియాలో 5% వాటా కొనుగోలుకు గూగల్‌ చర్చలు జరుపుతోందని సమాచారం. భారత్‌లో మరిన్ని పెట్టుబడులు సైతం పెట్టాలని గూగుల్‌ భావిస్తోందని ఒక ఆంగ్ల పత్రిక తెలిపింది. రిలయన్స్‌ జియోలో వాటా కొనుగోలు చేయడానికి గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ గతంలో చర్చించినా, ఫేస్‌బుక్‌ వంటి ఇతర వాటాదార్లతో పోలిస్తే సాధించలేకపోయింది. తాజాగా వొడాఫోన్‌ ఐడియాలో వాటా కొనుగోలు ద్వారా ఫేస్‌బుక్‌కు గట్టి జవాబు ఇవ్వాలని చూస్తున్నట్లుంది. కాగా, ఈ వ్యవహారంపై ఆదిత్య బిర్లా గ్రూప్‌ ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు. వొడాఫోన్‌ ఐడియా మార్కెట్‌ విలువ కేవలం రూ.16,724 కోట్లు మాత్రమే. అదే రిలయన్స్‌ జియో మార్కెట్‌ విలువ రూ.4.87 లక్షల కోట్లు. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో గూగుల్‌కు ఎంత మేలు జరుగుతుందన్నది చూడాలి. వొడాఫోన్‌ ఐడియాకు మాత్రం ఈ ఒప్పందం వల్ల మంచే జరగనుంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వానికి కట్టాల్సిన ఏజీఆర్‌ బకాయిలను కొంతైనా తగ్గించుకోగలుగుతుంది.

జియోలో మైక్రోసాఫ్ట్‌-రూ.15,000 కోట్లు

జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.5 శాతం కంటే ఎక్కువ వాటాను మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేయొచ్చని, ఈ విషయాలతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఆంగ్లపత్రిక తెలిపింది. డిజిటల్‌ చెల్లింపుల విషయంలో పలు కంపెనీలతో మైక్రోసాఫ్ట్‌ చర్చలు జరుపుతోంది. ‘రిలయన్స్‌ విషయానికొస్తే.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.5 శాతం కంటే ఎక్కువ వాటానే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంద’ని అందులో ఒక వ్యక్తి తెలిపారు. చర్చలు సఫలం అయితే జియోకు మరో 200 కోట్ల డాలర్ల (దాదాపు రూ.15,000 కోట్లు) పెట్టుబడులు రావొచ్చు. మైక్రోసాఫ్ట్‌ ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ.. పెట్టుబడులు కచ్చితంగా పెడుతుందన్న హామీ అయితే లేదని అందులోని రెండో వ్యక్తి తెలిపారు.

జియోలో అబుదాబి ఫండ్‌- రూ.7,500 కోట్లు

అబుదాబికి చెందిన ముబడాల ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ సైతం జియో ప్లాట్‌ఫామ్స్‌లో 100 కోట్ల డాలర్లు(దాదాపు రూ.7,500 కోట్లు) దాకా పెట్టుబడులు పెట్టనున్నట్లు విశ్వసనీయ వ్యక్తులను ఉటంకిస్తూ రాయిటర్స్‌ తెలిపింది. ఈ విషయంపై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి ప్రస్తుతానికి ఎటువంటి స్పందన లేదు. ‘జియో ప్లాట్‌ఫామ్స్‌ అనేది ప్రపంచ స్థాయి మదుపర్లను ఆకర్షిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్‌ మార్కెట్లలో ఒకటిగా దానికి గొప్ప శక్తి ఉంద’ని రాయిటర్స్‌కు పంపిన ఇమెయిల్‌లో ముడబాల పేర్కొంది.

ఎందుకింత ఆసక్తి..

భారత టెలికాం (మొబైల్‌) రంగంలో ఒకప్పుడు తీవ్ర పోటీ ఉండేది. స్థిరీకరణ అనంతరం ఆ పోటీ బాగా తగ్గింది. కేవలం మూడు కంపెనీలే ఇపుడు కనిపిస్తున్నాయి. 130 కోట్ల మంది ప్రజలుండగా, ఇంకా 20 కోట్ల మంది మొబైల్‌ కొనుగోలు చేయాల్సి ఉందనే విశ్లేషణలతో భారత టెలికాం రంగ వ్యాపారంపై సహజంగానే ఆసక్తి పెరుగుతోంది. పోటీ తక్కువగా ఉండటం వల్ల భవిష్యత్‌ బాగుంటుందన్న అంచనాలు ఉన్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో డేటా వినియోగానికి గిరాకీ భారీగా పెరిగింది. అన్ని మొబైల్‌ కంపెనీల ఫలితాల్లో డేటానే కీలకంగా మారింది. దేశీయ టెలికాంర రంగానికి ఉన్న ఒకే ఒక సమస్య భారీ అప్పులు. సాంకేతికతను పెంచుకోవడానికి పెట్టుబడులు జొప్పిస్తున్న కంపెనీలు ఇందుకోసం ఎక్కువ అప్పులు చేయాల్సి వచ్చింది. దీంతో అవి రుణాల్లో చిక్కుకుపోయాయి. టెలికాం ఆదాయాలు మరింత పెరుగుతాయనే భావనతోనే అంతర్జాతీయ పెట్టుబడుదార్లు ఇటు అడుగులు వేసేలా చేస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.