చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం హువావే భారత్లో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. "వై9 ప్రైమ్ 2019" పేరుతో రానున్న ఈ స్మార్ట్ ఫోన్ను ఆగస్టు 1న మార్కెట్లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత.
"వై9 ప్రైమ్ 2019" ఫీచర్లు:
- 16.7 సెంటీమీటర్ల పూర్తి డిస్ప్లే
- 4 జీబీ ర్యామ్/128 జీబీ రోమ్
- 16 ఎంపీ పాప్-అప్ సెల్ఫీ కెమెరా (ఏఐ సపోర్ట్)
- 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
- ఆక్టా-కోర్ కిరిన్ 710 ప్రాసెసర్
- కృత్రిమ మేధతో పనిచేసే వెనుక కెమెరా. ఒకే సారి 22 విభాగాలు, 500 దృశ్యాలను చిత్రీకరించే సామర్థ్యం
రియర్ కెమెరా మెగా పిక్సెల్, ఫోన్ ధర వంటి వివరాలు వెల్లడించలేదు హువావే.
ఇదీ చూడండి: 500 కోట్ల డాలర్ల జరిమానా చెల్లింపునకు ఫేస్బుక్ రెడీ