థియేటర్లో విడుదలయ్యే కొత్త సినిమాని ఇంట్లోనే కూర్చుని చూడవచ్చని ఇటీవలే సంచలన ప్రకటన చేసింది రిలయన్స్ జియో. కానీ అప్పుడే విడుదలైన సినిమాలను సాధారణ టీవీల్లో చూస్తే.. థియేటర్ అనుభూతి రాదు అనేది చాలా మంది వాదన. ఈ వాదనలకు అడ్డుకట్ట వేసేందుకు పలు సంస్థలు ఇంట్లోనే థియేటర్‌ను రూపొందించే ఆలోచనతో ముందుకొచ్చాయి.
అనేక మంది ఇప్పటికే ఈ సదుపాయాలను వినియోగించుకుంటున్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ వంటి.. సంస్థల కంటెంట్‌ను చూసేందుకు ఈ థియేటర్లు ఎక్కువగా వాడుతున్నారు. తమ వినియోగదారుల కోసం ఆయా సంస్థలు ప్రత్యేకంగా కొత్త సినిమాలను వారి ఇంట్లోని థియేటర్లలో చూసే వీలును కల్పిస్తున్నాయి. అయితే ఈ సదుపాయాలు కాస్త ఖర్చుతో కూడుకున్నవి. ఈ కారణంగా ఇవి సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితమయ్యాయని చెప్పాలి.
థియేటర్ నిర్మాణ ఖర్చు...
ఇంట్లో థియేటర్ నిర్మించుకునేందుకు సాధారణంగా రూ.లక్షన్నర కన్నా ఎక్కువ వెచ్చించే అవకాశముందని హోం థియేటర్ల నిర్మాణ సంస్థ 'వెక్టర్ సిస్టమ్స్' ఎండీ శేషా రెడ్డి తెలిపారు.
సామాన్యుడికీ అందుబాటులో..!
జియో ప్రీమియం చందాదారులకు 'ఫస్ట్ డే ఫస్ట్ షో' సదుపాయం 2020 ద్వితీయార్ధం నుంచి అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పెద్ద నగరాలకే పరిమితమైన ఇంటి థియేటర్ల ట్రెండ్ చిన్న పట్టణాలకూ విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే జియో ప్రీమియం కంటెంట్ సామాన్యులకు అందుబాటులో ఉండొచ్చని అంచనా. వారిని ఆకర్షించేందుకు.. పలు సంస్థలు బడ్జెట్‌కు అనుకూలంగా థియేటర్ నిర్మాణానికి ముందుకొస్తాయని అంటున్నారు.
ఇదీ చూడండి:'కుచ్ కుచ్ హోతా హై' సీక్వెల్లో వీరేనా..!