ETV Bharat / business

పద్దు 2020: 'ఆడీ' అడిగినట్లు కేంద్రం చేస్తుందా? - బడ్జెట్​ న్యూస్ లేటెస్ట్

దేశీయ వాహన రంగం 2019లో భారీగా అమ్మకాల క్షీణతను చవి చూసింది. ఈ నేపథ్యంలో రానున్న కేంద్ర బడ్జెట్​లో వాహన రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతోంది లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'ఆడీ'. అమ్మకాల్లో తిరిగి వృద్ధి సాధించాలంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఎంతో అవసరమని అభిప్రాయపడుతోంది.

budget
కేంద్ర బడ్జెట్​
author img

By

Published : Jan 26, 2020, 2:42 PM IST

Updated : Feb 25, 2020, 4:31 PM IST

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ బడ్జెట్​పై లగ్జరీ కార్ల తయారీ సంస్థలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి.

అధికంగా ఉన్న వస్తు సేవల పన్ను(జీఎస్టీ) రేట్లు, దిగుమతి సుంకాలు, రిజిస్ట్రేషన్​ రుసుముల కారణంగా లగ్జరీ కార్ల వ్యాపారం వృద్ధికి నోచుకోవడం లేదని పలు సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రానున్న బడ్జెట్​లో కేంద్రం తమకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతున్నాయి.

ఆడీ ఏమంటుందంటే..

దేశవ్యాప్తంగా గత ఏడాది తమ కార్ల అమ్మకాలు 28.92 శాతం తగ్గి 4,594 యూనిట్లకు పరిమితమైనట్లు 'ఆడీ' తెలిపింది. అంతకు ముందు 2018లో 6,463 యూనిట్లు విక్రయించిన విషయాన్ని గుర్తు చేసింది జర్మనీకి చెందిన ఈ లగ్జరీ కార్ల తయారీ సంస్థ.
తాము మాత్రమే కాకుండా లగ్జరీ కార్ల సంస్థలన్నీ గత ఏడాది భారీగా అమ్మకాల క్షీణతను చవి చూసినట్లు 'ఆడీ' తెలిపింది. లగ్జరీ కార్ల వ్యాపారం తిరిగి పుంజుకోవాలంటే ప్రభుత్వ సహాయం అవసరమని అంటోంది.

ప్రోత్సాహకాలు ఇలా ఉంటే మేలు..

ముఖ్యంగా జీఎస్టీ రేటు, దిగుమతి సుంకాలు, రిజిస్ట్రేషన్ రుసుములు తగ్గించమని కేంద్రాన్ని, జీఎస్టీ మండలిని కోరుతున్నట్లు 'ఆడీ ఇడియా' అధిపతి బల్వీర్​ సింగ్​ దిల్లాన్​ తెలిపారు. బ్యాంకింగ్, నాన్​ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల నుంచి రుణ సదుపాయాలను సులభతరం చేయడం ద్వారా వాహన పరిశ్రమ మొత్తానికి మేలు జరుగుతుందని ఆయన విశ్లేషించారు.

మిగతా సంస్థల పరిస్థితి ఇది..

భారత్​లో ప్రస్తుతం మెర్సిడెజ్ బెంజ్​, బీఎండబ్ల్యూ, ఆడీ, జాగ్వార్ లాండ్​రోవర్, వోల్వో ప్రధానంగా లగ్జరీ కార్ల వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి.

ఇందులో బెంజ్ 2019లో 11.28 శాతం క్షీణతతో 13,786 యూనిట్లు విక్రయించగలిగింది. 2018లో ఈ సంస్థ 15,538 కార్లు అమ్మింది.
బీఎండబ్ల్యూ 2019లో 13.8 శాతం క్షీణతను చవి చూసింది. 2019లో మొత్తం 9,641 కార్లను అమ్మగా.. 2018లో 11,105 యూనిట్లను విక్రయించింది బీఎండబ్ల్యూ.

ఇదీ చూడండి:పద్దు 2020: అంకుర సంస్థల గోడు వినండి

Last Updated : Feb 25, 2020, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.