ప్రైవేటు బ్యాంకిగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.5,676.06 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1 పోలిస్తే.. ఈ లాభాలు 18.04 శాతం అధికం. 2018-19 తొలి త్రైమాసికంలో రూ.4,808.35 కోట్ల నికర లాభాన్ని గడించింది ఈ బ్యాంకింగ్ దిగ్గజం.
2019-20 క్యూ1లో బ్యాంకు ఆదాయం రూ.34,324.45 కోట్లకు వృద్ధి చెందింది. అంతకు ముందు 2018-19 క్యూ1లో బ్యాంకు పూర్తి ఆదాయం రూ.28.000.06 కోట్లుగా ఉంది.
బ్యాంకు ఎన్పీఏలు జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి రూ.11,768.95 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. గత ఆర్థిక సవంత్సరం ఇదే సమయంలో పోలిస్తే ఇవి కాస్త పెరిగాయి. 2018-19 క్యూ1లో బ్యాంకు ఎన్పీఏలు రూ. 9.538.62 కోట్లుగా ఉన్నాయి.
ఇదీ చూడండి: చిరు వ్యాపారులూ... మీ బడ్జెట్ ఇలా ఉందా?