ETV Bharat / business

'ఎయిర్​ఇండియా వద్దు.. ఇండిగో అయితే ఓకే' - ఎయిర్​ఇండియాపై ఖతర్​ ఎయిర్​వేస్ అనాసక్తి

ప్రభుత్వ రంగ విమానాయన సంస్థ ఎయిర్​ఇండియాలో పెట్టుబడులు పెట్టే యోచన లేదని ఖతర్ ఎయిర్​వేస్ వెల్లడించింది. అయితే.. మరో ప్రైవేటు రంగ విమానయాన సంస్థ ఇండిగోలో పెట్టుబడిపై ఆసక్తి ఉన్నట్లు తెలిపింది.

'ఎయిర్​ఇండియా వద్దు.. ఇండిగో అయితే ఓకే'
author img

By

Published : Nov 7, 2019, 4:27 PM IST

ఎయిర్ఇండియాలో వాటా కొనుగోలుపై ఆసక్తి లేదని ఖతర్ ​ఎయిర్​వేస్​ స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ సీఈఓ అక్బర్​ అల్ బాకర్ అధికారిక ప్రకటన చేశారు.

ప్రభుత్వాధినంలోని ఎయిర్​ఇండియాలో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఎయిర్​ ఇండియాలో వాటాలు కొనుగోలు చేయాలని సింగపూర్​, లండన్​లలో రోడ్​ షోలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో వాటా కొనుగోలుపై ఆసక్తిలేదని ఖతర్ ఎయిర్​వేస్​ స్పష్టం చేసింది. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్​ ఇండియాను గట్టెక్కించేందుకు సంస్థలో వాటాను విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే.

అయితే ఇండిగో సంస్థలో పెట్టుబడులకు మాత్రం ఆసక్తిగా ఉన్నట్లు ఖతర్ ఎయిర్​వేస్​ వెల్లడించింది. కానీ ఇండిగో ప్రమోటర్ల మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో పెట్టడులకు ఇది సరైన సమయం కాదని భావిస్తున్నట్లు తెలిపింది.

దేశంలో ప్రస్తుతం 48 శాతం దేశీయ మార్కెట్​ వాటాతో ఇండిగో అగ్రస్థానంలో ఉంది. ఇటీవలే కొత్త విమానాలకు భారీ ఆర్డర్​ ఇచ్చింది ఇండిగో.

ఇదీ చూడండి: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 12 వేల మార్క్ దాటిన నిఫ్టీ

Ludhiana (Punjab), Nov 07 (ANI): Farmers continued to defy a ban imposed on stubble burning in Punjab. The latest visuals came in from Ludhiana's Talwara Hambran road. It is said that stubble burning is the sole cause of deteriorating air quality in Delhi-NCR.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.