ETV Bharat / business

హార్లే డేవిడ్​సన్​తో హీరో మోటోకార్ప్​ డీల్​ ఫిక్స్​

author img

By

Published : Oct 28, 2020, 9:02 AM IST

అమెరికాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హార్లే-డేవిడ్​సన్​తో జట్టు కట్టింది హీరో మోటోకార్ప్​. ఆ సంస్థకు చెందిన బైక్​లను అభివృద్ధి చేసి విక్రయిస్తామని తెలిపింది. భారత్​ నుంచి నిష్క్రమిస్తున్నట్లు గత నెలలో హార్లే డేవిడ్​సన్​ ప్రకటించిన క్రమంలో ఈ ఒప్పందం ప్రాధాన్య సంతరించుకుంది.

Hero
హీరో మోటోకార్ప్

అమెరికాకు చెందిన బైక్​ల తయారీ సంస్థ హార్లే-డేవిడ్​సన్​తో హీరో మోటోకార్ప్​ జట్టు కట్టింది. హార్లే-డేవిడ్​సన్​ భారత్​ నుంచి నిష్క్రమిస్తున్నట్లు గత నెలలో ప్రకటించిన నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ ఒప్పందం ప్రకారం.. హార్లే డేవిడ్​సన్​కు చెందిన ప్రీమియం మోటార్​ సైకిళ్లను హీరో మోటోకార్ప్​ అభివృద్ధి చేసి, హార్లే బ్రాండ్​ కిందే విక్రయించటంతో పాటు సర్వీసునూ అందిస్తుంది. విడిభాగాలు, యాక్సెసరీలు, జనరల్​ మెర్చండైజ్​, రైడింగ్​ గేర్​, అపారెల్​లను సైతం హార్లే డేవిడ్​సన్​ డీలర్​ నెట్​వర్క్​తో పాటు హీరో డీలర్​షిప్​ నెట్​వర్క్​ ద్వారానూ అందజేస్తారని ఇరు కంపెనీలు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: అమెరికా అధ్యక్ష ఎన్నిక.. స్టాక్‌మార్కెట్‌ ఏమవుతుందో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.