కరోనా కారణంగా సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడినా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్).. భారీ ఆదాయాలను నమోదు చేసింది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో రూ.22,700 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది.
ఈ సంస్థ ఆదాయం 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ.21,438 కోట్లుగా ఉంది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం 6 శాతం పెరిగినట్లు హాల్ తెలిపింది. ఉత్పత్తిలో పెరుగదలే దీనికి కారణం అని వెల్లడించింది.
2020-2021 ఆర్థిక సంవత్సరంలో 41 కొత్త విమానాలు, హెలికాప్టర్లు, 102 ఇంజిన్లను తయారు చేసినట్లు హాల్ తెలిపింది. మరో 198 విమానాలు, హెలికాప్టర్లను మరమ్మతు చేసినట్లు వెల్లడించింది. ఖర్చు తగ్గింపు చర్యలు కూడా సంస్థ ఆదాయం పెరుగుదలకు దోహదం చేసినట్లు తెలిపింది.
ఇదీ చూడండి: టీనేజర్లకూ మా టీకా సురక్షితం : ఫైజర్