ETV Bharat / business

త్వరలో మరో 20-25 విమానాశ్రయాల ప్రైవేటీకరణ - privatise airports

తొలి విడతతో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించిన ప్రభుత్వం రెండో విడతకు సిద్ధమైంది. త్వరలో 20 నుంచి 25 విమానాశ్రయాలను ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టుకు ఇవ్వనున్నట్లు ఏఏఐ ఛైర్మన్ గురుప్రసాద్ మహాపాత్ర తెలిపారు.

రెండో విడత ప్రైవేటీకరణ
author img

By

Published : Jul 26, 2019, 7:28 PM IST

విమానాశ్రయాల ప్రైవేటీకరణకు వడివడిగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. రెండో విడతలో 20 నుంచి 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించనున్నట్లు ఎయిర్​పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఛైర్మన్​ గురుప్రసాద్ మహాపాత్ర వెల్లడించారు. తొలి విడతలో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించింది ప్రభుత్వం.

"ఇప్పుడు ప్రైవేటీకరించే 20 నుంచి 25 విమానాశ్రయాలు దేశంలో ప్రముఖమైనవి. వీటి ద్వారా ఏడాదికి 10 నుంచి 15 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుంటారు."
- గురుప్రసాద్ మహాపాత్ర, ఏఏఐ ఛైర్మన్​

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో విమానాశ్రయాల అభివృద్ధి, కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించింది.

మొదటి విడతలో లఖ్​నవూ, అహ్మదాబాద్, జైపుర్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలను ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టుకు ఇచ్చింది ప్రభుత్వం. వీటిలో గువాహటి మినహా ఐదు విమానాశ్రయాల కాంట్రాక్టులను అదానీ గ్రూప్ చేజిక్కించుకోవడం గమనార్హం.

ఇదీ చూడండి: గెలాక్సీ ఫోల్డ్​ ఫోన్​పై బంపర్​ ఆఫర్​ భారత్​కే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.