ఏజీఆర్ వ్యవహారంలో టెలికాం సంస్థలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. బకాయిలకు సంబంధించి స్వీయ మదింపు వివరాలు అందించాలని టెల్కోలను ప్రభుత్వం అడిగినట్లు సమాచారం.
వివిధ టెలికాం సర్కిళ్లలో లెక్కింపులు భిన్నంగా ఉన్నాయని ప్రభుత్వం నిర్ధరించింది. ఫలితంగా బకాయిలను ప్రభుత్వం మళ్లీ లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. టెలికాం సంస్థలు స్వీయ మదింపు వివరాలు అందిస్తే లెక్కింపు మరింత సులభం అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు సంబంధిత పత్రాలు అందించాలని భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీసర్వీసెస్లను టెలికాం శాఖ ఆదేశించినట్లు సమాచారం.